యేసుతో ప్రతి ఉదయము:-
ఈరోజు దేవుని వాగ్దానము:-
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము;నీవు ఆయనను నమ్ము కొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కీర్తనలు 37:5
నేటి దైవ ధ్యానం: ఆందోళన వద్దు.. అప్పగింతే ముద్దు
మన జీవితంలో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు సహజంగానే మనకు కలిగే మొదటి స్పందన ‘కంగారు’. ఆ కంగారులో మనం చేసే ప్రార్థనలు ఎలా ఉంటాయంటే.. దేవునికి మన సమస్యను వివరించడం కంటే, మనం అనుకున్న పరిష్కారాన్ని ఆయనపై రుద్దడానికే ప్రయత్నిస్తుంటాము. దీనినే కేథరిన్ మార్షల్ “కంగారు ప్రార్థనలు” అని అన్నారు.
నేటి వాగ్దానము:
”నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము; నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును.” (కీర్తనల గ్రంథము 37:5)
✨ ఆలోచించాల్సిన విషయాలు:
పరిత్యాగము అంటే ఏమిటి?: మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలనే మొండితనాన్ని వదిలిపెట్టి, “దేవా, నీ చిత్తమే జరుగును గాక” అని సంపూర్ణంగా ఆయన చేతులకు అప్పగించడమే పరిత్యాగము.
శాంతికి మార్గం: మనం ఎప్పుడైతే “నాకు ఇది కావాలి” అనే డిమాండ్‌ను వదిలేసి, ఆయన జ్ఞానానికి చోటు ఇస్తామో, అప్పుడే మన హృదయంలో దైవిక శాంతి మొదలవుతుంది.
ఆయన నిర్వహణ: మనం పట్టు వదిలినప్పుడే, దేవుడు ఆ బాధ్యతను తీసుకుంటాడు. మనకంటే ఆయనకు మన మేలు బాగా తెలుసు.
💡 స్ఫూర్తిదాయక పలుకులు (Motivational Quotes)
”ప్రార్థన అంటే దేవునికి ఆర్డర్లు వేయడం కాదు, మనల్ని మనం ఆయన చిత్తానికి లోబరుచుకోవడం.”
”నీ భయాలను లెక్కపెట్టడం ఆపి, దేవుని శక్తిని నమ్మడం మొదలుపెట్టు. అద్భుతాలు అక్కడే మొదలవుతాయి.”
”కంగారు పడటం వల్ల రేపటి సమస్యలు తీరవు, కానీ ఈరోజు ఉండాల్సిన ప్రశాంతత మాత్రం దూరమవుతుంది.”
”దేవుని చేతుల్లో నీ జీవితాన్ని పెట్టినప్పుడు, నీవు ఓడిపోవడానికి అవకాశమే లేదు.”
మన జీవితంలో కంగారు అనేది సహజమే.
కాని ఆ కంగారును మనం ఎలా ప్రార్థనగా మార్చుతున్నామో దేవుడు చూస్తాడు.
కేథరిన్ మార్షల్ తన “మనకు అతీతంగా” అనే పుస్తకంలో ఒక విలువైన సత్యాన్ని పంచుకుంది.
ఆమె మొదట్లో భయపడిన ప్రతీసారి దేవుని దగ్గరకు వెళ్లి,
“దేవా! నాకు ఇది తప్పకుండా కావాలి!”
అని డిమాండ్ చేసేది.
అలాంటి ప్రార్థనల్లో దేవుడు మౌనంగా ఉన్నట్టుగా అనిపించేది.
కాని ఒక రోజు ఆమె “పరిత్యాగ ప్రార్థన” నేర్చుకుంది.
“ప్రభువా, ఈ పరిస్థితిని పూర్తిగా నీ చేతుల్లో పెట్టుతున్నాను.
నాకు ఎలా కావాలో కాదు…
నీకు ఎలా ఇష్టమో అలా చేయి.”
అప్పుడే అద్భుతం జరిగింది.
పరిస్థితులు వెంటనే మారలేదు…
కానీ ఆమె హృదయంలో భయం పోయి, శాంతి వచ్చింది.
అప్పటి నుంచీ దేవుడు విషయాలను తనదైన రీతిలో నిర్వహించసాగాడు.
దావీదు కీర్తనలు 37లో ఇదే సూత్రాన్ని మనకు నేర్పిస్తున్నాడు:
1.అప్పగించు
2.నమ్ము
3.వేచి చూడు
దేవునికి మన జీవితాన్ని అప్పగించడం అంటే
మన ఉద్యోగం మాత్రమే కాదు,
మన కుటుంబం మాత్రమే కాదు,
మన భయాలు, కంగారు, రేపటి ఆందోళనల్ని కూడా ఆయన చేతుల్లో పెట్టడం.
డిమాండ్ చేసే ప్రార్థనలకంటే
దాసోహం చేసే ప్రార్థనలకు
దేవుడు అత్యధికంగా స్పందిస్తాడు.
గోప్ప సేవకుల పలుకులు (Great Quotes)
కేథరిన్ మార్షల్:
“దేవునికి పరిస్థితిని అప్పగించిన క్షణమే,
భయానికి మన జీవితంలో స్థానం ఉండదు.”
ఏ.డబ్ల్యూ. టోజర్:
“నిజమైన విశ్వాసం అనేది దేవుడు మనకోసం ఏం చేస్తాడో చూడటం కాదు,
మనల్ని ఆయన చేతుల్లో పెట్టడం.”
జో యని యోడర్:
“కంగారు ప్రార్థనలు దేవుని మీద ఒత్తిడి పెడతాయి,
పరిత్యాగ ప్రార్థనలు దేవునికి స్వేచ్ఛ ఇస్తాయి.”
ప్రేరణాత్మక వాక్యాలు (Motivation Quotes)
“నీ చేతుల్లో లేని విషయాల కోసం కంగారు పడకూ,
దేవుని చేతుల్లో ఉన్నవాటిని నమ్ము.”
“ప్రార్థన అనేది దేవునికి ఆదేశాలు ఇవ్వడం కాదు,
మన జీవితాన్ని ఆయనకు అప్పగించడం.”
“శాంతి రావాలంటే సమస్యలు పోవాల్సిన అవసరం లేదు,
దేవుడు నియంత్రణలో ఉన్నాడని తెలుసుకుంటే చాలు.”
ఈరోజు ప్రార్థన
ప్రభువా,
నా కంగారు ప్రార్థనలను క్షమించు.
నాకు కావాల్సిందే చేయమని నిన్ను ఒత్తిడి పెట్టిన ప్రతి క్షణానికి క్షమించు.
ఈరోజు నా భయాలను, నా ఆందోళనలను, నా రేపటి అనిశ్చితిని
పూర్తిగా నీ చేతుల్లో పెడుతున్నాను.
నీవే నడిపించు…
నీవే నిర్వహించు…
నీవే మహిమ పొందు. ప్రభువా
యేసు నామములో ప్రార్ధిస్తున్నాము తండ్రి
ఆమేన్. 🙏
ONE YEAR BIBLE READING PLAN
ఆదికాండము 22:1
ఆఆ సంగతులు జరిగినతరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రా హామా, అని పిలువగా అతడుచిత్తము ప్రభువా అనెను.
ఆదికాండము 22:2
అప్పుడాయననీకు ఒక్కడైయున్న నీ కుమారుని, అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసికొని మోరీయా దేశమునకు వెళ్లి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిమీద దహనబలిగా అతని నర్పించమని చెప్పెను.
ఆదికాండము 22:3
తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలికొరకు కట్టెలు చీల్చి, లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్లెను.
ఆదికాండము 22:4
మూడవ నాడు అబ్రాహాము కన్నులెత్తి దూరమునుండి ఆ చోటు చూచి
ఆదికాండము 22:5
తన పని వారితోమీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి; నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి (దేవునికి) మ్రొక్కి మరల మీయొద్దకు వచ్చెదమని చెప్పి
ఆదికాండము 22:6
దహనబలికి కట్టెలు తీసికొని తన కుమారుడగు ఇస్సాకుమీద పెట్టి తనచేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్లుచుండగా
ఆదికాండము 22:7
ఇస్సాకు తన తండ్రియైన అబ్రాహాముతో నా తండ్రీ అని పిలిచెను; అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలును ఉన్నవిగాని దహనబలికి గొఱ్ఱెపిల్ల ఏది అని అడుగగా
ఆదికాండము 22:8
అబ్రాహాము నాకుమా రుడా, దేవుడే దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనునని చెప్పెను.
ఆదికాండము 22:9
ఆలాగు వారిద్దరు కూడి వెళ్లి దేవుడు అతనితో చెప్పినచోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలి పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెలమీద ఉంచెను.
ఆదికాండము 22:10
అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించు టకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా
ఆదికాండము 22:11
యెహోవా దూత పరలోకమునుండి అబ్రాహామా అబ్రాహామా అని అతని పిలి చెను; అందుకతడుచిత్తము ప్రభువా అనెను.
ఆదికాండము 22:12
అప్పుడు ఆయన ఆ చిన్నవానిమీద చెయ్యి వేయకుము; అతని నేమియు చేయకుము; నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయ లేదుగనుక నీవు దేవునికి భయపడువాడవని యిందవలన నాకు కనబడుచున్నదనెను.
ఆదికాండము 22:13
అప్పుడు అబ్రాహాము కన్ను లెత్తి చూడగా పొదలో కొమ్ములుతగులుకొనియున్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రాహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను.
ఆదికాండము 22:14
అబ్రాహాము ఆ చోటికి యెహోవా యీరే అను పేరు పెట్టెను. అందుచేతయెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును.
ఆదికాండము 22:15
యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను
ఆదికాండము 22:16
నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున
ఆదికాండము 22:17
నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు.
ఆదికాండము 22:18
మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెన నెను.
ఆదికాండము 22:19
తరువాత అబ్రాహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరును కలిసి బెయేర్షెబాకు వెళ్లిరి. అబ్రాహాము బెయేర్షెబాలో నివసించెను.
ఆదికాండము 22:20
ఆ సంగతులు జరిగిన తరువాత అబ్రాహామునకు తెలుప బడినదేమనగామిల్కా అను ఆమెయు నీ సహోదరుడగు నాహోరునకు పిల్లలను కనెను.
ఆదికాండము 22:21
వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,
ఆదికాండము 22:22
కెసెదు, హజో, షిల్దాషు, యిద్లాపు, బెతూ యేలు. బెతూయేలు రిబ్కాను కనెను.
ఆదికాండము 22:23
ఆ యెనిమిదిమందిని మిల్కా అబ్రాహాము సహోదరుడగు నాహోరునకు కనెను.
ఆదికాండము 22:24
మరియు రయూమా అను అతని, ఉపపత్నియు తెబహును, గహమును తహషును మయకాను కనెను.
ఆదికాండము 23:1
శారా జీవించిన కాలము, అనగా శారా బ్రదికినయేండ్లు నూట ఇరువది యేడు.
ఆదికాండము 23:2
శారా కనాను దేశమందలి హెబ్రోనను కిర్యతర్బాలో మృతిబొందెను; అప్పుడు అబ్రాహాము శారా నిమిత్తము అంగలార్చు టకును ఆమెను గూర్చి యేడ్చుటకును వచ్చెను.
ఆదికాండము 23:3
తరువాత అబ్రాహాము మృతిబొందిన తన భార్య యెదుటనుండి లేచి హేతు కుమారులను చూచి
ఆదికాండము 23:4
మీ మధ్య నేను పరదేశినిగాను పరవాసినిగాను ఉన్నాను. మృతిబొందిన నా భార్య నా కన్నులయెదుట ఉండకుండ, ఆమెను పాతి పెట్టుటకు మీ తావున నా కొక శ్మశానభూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడని అడుగగా
ఆదికాండము 23:5
హేతు కుమారులు అయ్యా మా మాట వినుము. నీవు మా మధ్యను మహారాజవై యున్నావు;
ఆదికాండము 23:6
మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దానియందు మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుము; నీవు మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టునట్లు మాలో తన శ్మశానభూమి ఇయ్యనొల్లనివాడు ఎవడును లేడని అబ్రాహాము కుత్తరమిచ్చిరి.
ఆదికాండము 23:7
అప్పుడు అబ్రాహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడి
ఆదికాండము 23:8
మృతిబొందిన నా భార్యను నా యెదుట ఉండకుండ నేను పాతి పెట్టుట మీకిష్టమైతే నా మాట వినుడి.
ఆదికాండము 23:9
సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను.
ఆదికాండము 23:10
అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యను కూర్చుండి యుండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించువారందరి యెదుట హేతు కుమారులకు వినబడు నట్లు అబ్రాహాముతో చెప్పిన ప్రత్యుత్తరమేమనగా
ఆదికాండము 23:11
అయ్యా అట్లు కాదు నా మనవి నాలకించుము, ఆ పొలమును నీకిచ్చుచున్నాను; దానిలోనున్న గుహను నీకిచ్చు చున్నాను; నా ప్రజల యెదుట అది నీకిచ్చుచున్నాను; మృతిబొందిన నీ భార్యను పాతి పెట్టు మనెను.
ఆదికాండము 23:12
అప్పుడు అబ్రాహాము ఆ దేశపు ప్రజల యెదుట సాగిలపడి
ఆదికాండము 23:13
సరేకాని నా మనవి ఆలకించుము. ఆ పొలమునకు వెల యిచ్చెదను; అది నాయొద్ద పుచ్చు కొనినయెడల మృతిబొందిన నా భార్యను పాతి పెట్టెదనని ఆ దేశ ప్రజలకు వినబడు నట్లు ఎఫ్రోనుతో చెప్పెను.
ఆదికాండము 23:14
అందుకు ఎఫ్రోను అయ్యా నా మాట వినుము; ఆ భూమి నాలుగు వందల తులముల వెండి చేయును;
ఆదికాండము 23:15
నాకు నీకు అది యెంత? మృతిబొందిన నీ భార్యను పాతిపెట్టుమని అబ్రాహామున కుత్తరమిచ్చెను;
ఆదికాండము 23:16
అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.
ఆదికాండము 23:17
ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటి లోనున్న ఆ పొలము చెట్లన్నియు,
ఆదికాండము 23:18
అతని ఊరి గవిని ప్రవేశించు వారందరిలో హేతు కుమారుల యెదుట అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
ఆదికాండము 23:19
ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రేయెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.
ఆదికాండము 23:20
ఆ పొలమును దానిలోనున్న గుహయు హేతు కుమారులవలన శ్మశానముకొరకు అబ్రాహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడెను.
ఆదికాండము 24:1
అబ్రాహాము బహు కాలము గడిచిన వృద్ధుడై యుండెను. అన్ని విషయములలోను యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను.
ఆదికాండము 24:2
అప్పుడు అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన యింటి పెద్దదాసునితో నీ చెయ్యి నా తొడక్రింద పెట్టుము;
ఆదికాండము 24:3
నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒక దానిని నా కుమారునికి పెండ్లిచేయక
ఆదికాండము 24:4
నా స్వదేశమందున్న నా బంధువులయొద్దకు వెళ్లి ఇస్సాకను నా కుమారునికి భార్యను తెచ్చునట్లు ఆకాశముయొక్క దేవుడును భూమియొక్క దేవుడు నైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయిం చెదననెను.
ఆదికాండము 24:5
ఆ దాసుడుఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని యెడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసికొని పోవలెనా అని అడుగగా
ఆదికాండము 24:6
అబ్రాహాము అక్కడికి నా కుమారుని తీసికొని పోకూడదు సుమీ.
ఆదికాండము 24:7
నా తండ్రి యింటనుండియు నేను పుట్టిన దేశము నుండియు నన్ను తెచ్చి నాతో మాటలాడినీ సంతానమునకు ఈ దేశము నిచ్చెదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును; అక్కడనుండి నీవు నా కుమారునికి భార్యను తీసికొనివచ్చెదవు.
ఆదికాండము 24:8
అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని యెడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందెదవు గాని నీవు నా కుమారుని అక్కడికి తీసికొని పోకూడదని అతనితో చెప్పెను.
ఆదికాండము 24:9
ఆ దాసుడు తన యజమానుడగు అబ్రాహాము తొడక్రింద తన చెయ్యి పెట్టి యీ సంగతి విషయమై ప్రమాణము చేసెను.
ఆదికాండము 24:10
అతడు తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను తన యజమా నుని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములగు వస్తువులను తీసికొని పోయెను. అతడు లేచి అరామ్నహరాయిము లోనున్న నాహోరు పట్టణము చేరి
ఆదికాండము 24:11
సాయంకాలమందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్లబావియొద్ద తన ఒంటెలను మోక రింపచేసి యిట్లనెను
ఆదికాండము 24:12
నా యజమానుడగు అబ్రాహాము దేవుడవైన యెహోవా, నేనువచ్చిన కార్యమును త్వరలో సఫలముచేసి నా యజమానుడగు అబ్రాహాము మీద అనుగ్రహము చూపుము.
ఆదికాండము 24:13
చిత్త గించుము, నేను ఈ నీళ్ల ఊటయొద్ద నిలుచు చున్నాను; ఈ ఊరివారి పిల్లలు నీళ్లు చేదుకొనుటకు వచ్చుచున్నారు.
ఆదికాండము 24:14
కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగానీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకుకొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానునిమీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను.
ఆదికాండము 24:15
అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను.
ఆదికాండము 24:16
ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు; ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొనియెక్కి రాగా
ఆదికాండము 24:17
ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగ నిమ్మని అడిగెను.
ఆదికాండము 24:18
అందుకామె అయ్యా త్రాగు మని చెప్పి త్వరగా తన కడవను చేతిమీదికి దించుకొని అతనికి దాహమిచ్చెను.
ఆదికాండము 24:19
మరియు ఆమె అతనికి దాహ మిచ్చిన తరువాతనీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికిని నీళ్లు చేదిపోయుదునని చెప్పి
ఆదికాండము 24:20
త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావికి పరుగెత్తు కొని పోయి అతని ఒంటెలన్నిటికి నీళ్లు చేదిపోసెను.
ఆదికాండము 24:21
ఆ మనుష్యుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలముచేసెనో లేదో తెలిసికొనవ లెనని ఊర కుండెను.
ఆదికాండము 24:22
ఒంటెలు త్రాగుటయైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని, ఆమె చేతులకు పది తులముల ఎత్తు గల రెండు బంగారు కడియములను తీసి
ఆదికాండము 24:23
నీవు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పుము; నీ తండ్రి యింట మేము ఈ రాత్రి బసచేయుటకు స్థలమున్నదా అని అడిగెను.
ఆదికాండము 24:24
అందుకామె నేను నాహోరుకు మిల్కాకనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెననెను.
ఆదికాండము 24:25
మరియు ఆమెమా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బసచేయుటకు స్థలమును ఉన్న వనగా
ఆదికాండము 24:26
ఆ మనుష్యుడు తన తలవంచి యెహోవాకు మ్రొక్కి
ఆదికాండము 24:27
అబ్రాహామను నా యాజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక; ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు; నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువులు ఇంటికి నన్ను నడిపించెననెను.
ఆదికాండము 24:28
అంతట ఆ చిన్నది పరుగెత్తికొనిపోయి యీ మాటలు తన తల్లి యింటి వారికి తెలిపెను.
ఆదికాండము 24:29
రిబ్కాకు లాబానను నొక సహోదరు డుండెను. అప్పుడు లాబాను ఆ బావిదగ్గర వెలు పటనున్న ఆ మనుష్యుని యొద్దకు పరుగెత్తికొని పోయెను.
ఆదికాండము 24:30
అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులనున్న ఆ కడియములను చూచిఆ మనుష్యుడు ఈలాగు నాతో మాటలాడెనని తన సహోదరియైన రిబ్కా చెప్పినమాటలు విని ఆ మనుష్యుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావియొద్ద ఒంటెలు దగ్గర నిలిచి యుండగా
ఆదికాండము 24:31
లాబాను యెహోవావలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము; నీవు బయట నిలువనేల? ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధము చేయించితిననెను.
ఆదికాండము 24:32
ఆ మనుష్యుడు ఇంటికి వచ్చి నప్పుడు లాబాను ఒంటెల గంతలు విప్పి ఒంటెలకు గడ్డియు మేతయు కాళ్లు కడుగు కొనుటకు అతనికిని అతనితో కూడ నున్నవారికిని నీళ్లు ఇచ్చి
ఆదికాండము 24:33
అతనికి భోజనము పెట్టించెను గాని అతడునేను వచ్చిన పనిచెప్పక మునుపు భోజనము చేయననగా లాబాను చెప్పుమనెను.
ఆదికాండము 24:34
అంతట అతడిట్లనెనునేను అబ్రాహాము దాసుడను,
ఆదికాండము 24:35
యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయెను; అతనికి గొఱ్ఱెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసీ జనమును ఒంటెలను గాడిదలను దయచేసెను.
ఆదికాండము 24:36
నా యజ మానుని భార్యయైన శారా వృద్ధాప్యములో నా యజ మానునికి కుమారుని కనెను; నా యజమానుడు తనకు కలిగినది యావత్తును అతనికిచ్చి యున్నాడు;
ఆదికాండము 24:37
మరియు నా యజమానుడు నాతోనేను ఎవరి దేశమందు నివ సించుచున్నానో ఆ కనానీయుల పిల్లలలో ఒక పిల్లను నా కుమారునికి పెండ్లిచేయవద్దు.
ఆదికాండము 24:38
అయితే నా తండ్రి యింటికిని నా వంశస్థుల యొద్దకును వెళ్లి నా కుమారునికి పెండ్లి చేయుటకు ఒక పిల్లను తీసికొని రావలెనని నాచేత ప్రమా ణము చేయించెను.
ఆదికాండము 24:39
అప్పుడు నేను నా యజమానునితో ఆ స్త్రీ నావెంట రాదేమో అని చెప్పినందుకు
ఆదికాండము 24:40
అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు
ఆదికాండము 24:41
నీవు నా వంశస్థులయొద్దకు వెళ్లితివా యీ ప్రమాణము విషయములో ఇక నీకు బాధ్యత ఉండదు, వారు ఆమెను ఇయ్యనియెడలకూడ ఈ ప్రమాణము విషయములో నీకు బాధ్యత ఉండదని చెప్పెను.
ఆదికాండము 24:42
నేను నేడు ఆ బావి యొద్దకు వచ్చి అబ్రాహామను నా యజమానుని దేవుడవైన యెహోవా, నా ప్రయాణ మును నీవు సఫలము చేసిన యెడల
ఆదికాండము 24:43
నేను ఈ నీళ్ల బావియొద్ద నిలిచియుండగా నీళ్లు చేదుకొనుటకు వచ్చిన చిన్నదానితో నేనునీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పు నప్పుడు
ఆదికాండము 24:44
నీవు త్రాగుము నీ ఒంటెలకును చేది పోయుదునని యెవతె చెప్పునో ఆమెయే నా యజమానుని కుమారునికి యెహోవా నియమించిన పిల్లయై యుండును గాకని మనవిచేసికొంటిని.
ఆదికాండము 24:45
నేను నా హృదయములో అట్లు అనుకొనుట చాలింపక ముందే రిబ్కా భుజముమీద తన కడవను పెట్టుకొనివచ్చి ఆ బావిలోనికి దిగిపోయి నీళ్లు చేదుకొని వచ్చెను; అప్పుడునాకు దాహమిమ్మని నేనామెను అడుగగా
ఆదికాండము 24:46
ఆమె త్వరగా తన కడవను దించిత్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని చెప్పెను గనుక నేను త్రాగితిని; ఆమె ఒంటెలకును నీళ్లు పెట్టెను.
ఆదికాండము 24:47
అప్పుడు నేను నీవు ఎవరికుమార్తెవని యడిగినందుకు ఆమె మిల్కా నాహోరునకు కనిన కుమారుడగు బెతూయేలు కుమార్తెనని చెప్పినప్పుడు, నే నామె ముక్కుకు కమ్మియును ఆమె చేతులకు కడియములను పెట్టి
ఆదికాండము 24:48
నా తలవంచి యెహోవాకు మ్రొక్కి, అబ్రాహామను నా యజమానుని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసితిని; ఏలయనగా ఆయన నా యజమానుని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారునికి తీసికొనునట్లు సరియైన మార్గమందు నన్ను నడి పించెను.
ఆదికాండము 24:49
కాబట్టి నా యజమానునియెడల మీరు దయను నమ్మకమును కనుపరచినయెడల అదియైనను నాకు తెలియచెప్పుడి, లేనియెడల అదియైనను తెలియ చెప్పుడి; అప్పుడు నేనెటు పోవలెనో అటు పోయెదననగా
ఆదికాండము 24:50
లాబానును బెతూయేలునుఇది యెహోవావలన కలిగిన కార్యము; మేమైతే అవునని గాని కాదనిగాని చెప్ప జాలము;
ఆదికాండము 24:51
ఇదిగో రిబ్కా నీ యెదుట నున్నది, ఆమెను తీసికొని పొమ్ము; యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజ మానుని కుమారునికి భార్య అగునుగాకని ఉత్తర మిచ్చిరి.
ఆదికాండము 24:52
అబ్రాహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేసెను.
ఆదికాండము 24:53
తరువాత ఆ సేవకుడు వెండి నగలను బంగారు నగలను, వస్త్ర ములను తీసి రిబ్కాకు ఇచ్చెను; మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికిని విలువగల వస్తువులు ఇచ్చెను.
ఆదికాండము 24:54
అతడును అతనితోకూడనున్న మనుష్యులును అన్నపాన ములు పుచ్చుకొని అక్కడ ఆ రాత్రియంతయు నుండిరి. ఉదయమున వారు లేచి నప్పుడు అతడునా యజమానుని యొద్దకు నన్ను పంపించుడని చెప్పగా
ఆదికాండము 24:55
ఆమె సహోదరుడును ఆమె తల్లియుఈ చిన్నదాని పదిదినములైనను మాయొద్ద ఉండ నిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్లవచ్చు ననిరి.
ఆదికాండము 24:56
అప్పుడతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసెను గనుక నాకు తడవు కానీయక నన్ను పంపించుడి, నా యజమానుని యొద్దకు వెళ్లెదనని చెప్పి నప్పుడు
ఆదికాండము 24:57
వారు ఆ చిన్న దానిని పిలిచి, ఆమె యేమనునో తెలిసికొందమని చెప్పుకొని
ఆదికాండము 24:58
రిబ్కాను పిలిచిఈ మనుష్యునితోకూడ వెళ్లెదవా అని ఆమె నడిగినప్పుడువెళ్లెదననెను.
ఆదికాండము 24:59
కాబట్టి వారు తమ సహోదరియైన రిబ్కాను ఆమె దాదిని అబ్రాహాము సేవకుని అతనితో వచ్చిన మనుష్యులను సాగనంపినప్పుడు
ఆదికాండము 24:60
వారు రిబ్కాతో మా సహోదరీ, నీవు వేల వేలకు తల్లి వగుదువు గాక, నీ సంతతివారు తమ పగవారి గవినిని స్వాధీనపరచుకొందురు గాక అని ఆమెను దీవింపగా
ఆదికాండము 24:61
రిబ్కాయు ఆమె పని కత్తెలును లేచి ఒంటెల నెక్కి ఆ మనుష్యుని వెంబడివెళ్లిరి. అట్లు ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని పోయెను.
ఆదికాండము 24:62
ఇస్సాకు బెయేర్ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను.
ఆదికాండము 24:63
సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్లి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను,
ఆదికాండము 24:64
రిబ్కా కన్ను లెత్తి ఇస్సాకును చూచి ఒంటెమీదనుండి దిగి
ఆదికాండము 24:65
మనల నెదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుష్యు డెవరని దాసుని నడుగగా అతడుఇతడు నా యజమాను డని చెప్పెను గనుక ఆమె ముసుకు వేసికొనెను.
ఆదికాండము 24:66
అప్పుడా దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను.
ఆదికాండము 24:67
ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణపొందెను.

Leave a Reply