యేసుతో ప్రతి ఉదయము

యేసుతో ప్రతి ఉదయము:- Day35
ఈరోజు దేవుని వాగ్దానము:-

యెహోవా నీకు తోడై యున్నాడు. న్యాయధిపతులు 6:12

అంశం :-“బలహీనతలో దైవబలం” (Strength in Weakness)ó

యహోవా దూత అతనికి కనబడి పరక్రమము గల బలడ్యుడా, యెహోవా నీకు తోడై యున్నాడని అతనితో అనెను.

ప్రారంభములో గిద్యోనును ఒక పిరికివానిగా చుచున్నాము. అతడు మిద్యాని్యులకు మరుగై ఉండునట్లు దుల్లగొట్టుచుండగా దేవుని దూత ప్రత్యక్షమై మాట్లాడెను. దూత సంభోదన -పరాక్రమముగల బలడ్యుడు -గిద్యోను అంగీకారముగా లేదు. అందువలన ఆయన అద్భుత కార్యాములు ఏమయ్యేనని ప్రశ్నించేను

అయితే గిద్యోను బలపరచబడెను. గనుక మూడు వందల మందితోనే అతడు మీద్యాని్యులను జయించేను. శక్తిచేతనైనను కాక బలముచేతనైనను గాక నా ఆత్మ ద్వారా ఇది జరుగును అను గుణపాఠంను దేవుడు గిద్యోనుకు నేర్పేను.

దేవుని బిడ్డలారా, మీరు విదేయత చూపిన కొలది ప్రభువు మీ జీవితములలో ఆశ్చరయ్యకరమైన మలుపులు కలగజేయును. రాత్రి అంతయు ప్రయాసపడినను చేపలు పట్టలేకపోయిన పేతురు బృందము ప్రభువు మాట చొప్పున వలలు వేయగా అవి పిగిలిపోయినంతగా చేపలు దొరికేను. చేపలను పట్టు జాలరిగా నుండిన పేతురు మనుష్యులను పట్టుజాలరిగా మార్చబడెను. ఈ సంఘటన పేతురు జీవితములో మలుపు తెచ్చెను. పేతురు ఆత్మ పూర్ణుడై మాట్లాడినప్పుడు వేల సంఖ్యలో ప్రజలు ప్రభువు తట్టు తిరిగిరి. గిద్యోనును బలపరచిన దేవుడు పేతురును కూడా బలపరచేను. గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గము యెహోవా ఖడ్గము అని అర్భాటించుట ద్వారా వారికి జయము లభించేను. ఇప్పుడు కృపకాలమందు, దేవుని వాక్యము రెండంచుల వాడిగల ఖడ్గముగా నున్నది. హెబ్రీ 4:12. అది ఆత్మఖడ్గము ఎఫెసీ 6:17

“మిమ్ములను పిలిచిన పిలుపును చూడుడీ”అని మొదలుపెట్టిన పౌలు దేవుడు లోకరితిగా జ్ఞానులను, ఘనులను, గొప్ప వంశపు వారిని పిలువలేదని చెప్పుటయేకాక లోకములో నుండు వెర్రివారు, బలహీనులను, నీచులను, తృణికరీంపబడినవారు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని యున్నాడని స్పష్టముగా వ్రాయుచున్నాడు. 1కొరింది 1:29-29.మనుష్యులు మిమ్మును చూచున్న ప్రకారము, ప్రభువు మిమ్మును చూచుట లేదు. ప్రభువు కనికరము, కృప గొప్ప కార్యములు చేయువారిగా మిమ్మును మార్చుచున్నది.

కథ: శిల్పి మరియు రాయి

​ఒక ఊరి చివర ఒక పగుళ్లు ఉన్న, ఆకారం లేని పెద్ద రాయి పడి ఉంది. వెళ్ళేవాళ్ళంతా ఆ రాయిని చూసి “ఇది దేనికీ పనికిరాదు, దారికి అడ్డంగా ఉంది” అని తిట్టుకునేవారు. కానీ ఒక శిల్పి ఆ రాయిని చూసి, దానిని తన ఇంటికి తీసుకెళ్ళాడు.

​కొన్ని రోజుల పాటు శిల్పి తన ఉలితో ఆ రాయిని చెక్కుతూనే ఉన్నాడు. చివరికి ఆ పగుళ్లు ఉన్న రాయి నుండి ఒక అద్భుతమైన రాజకుమారుడి విగ్రహం బయటపడింది. ప్రజలందరూ ఆశ్చర్యపోయి, “ఇంత అందమైన విగ్రహం ఈ పనికిరాని రాయి నుండి ఎలా వచ్చింది?” అని అడిగారు. అప్పుడు ఆ శిల్పి నవ్వుతూ, “ఈ విగ్రహం రాయిలోనే ఉంది, నేను కేవలం పనికిరాని భాగాన్ని మాత్రమే తొలగించాను” అన్నాడు.

​పాఠం: గిద్యోను తనను తాను పిరికివానిగా చూసుకున్నాడు, కానీ దేవుడు అతనిలో ఉన్న “పరాక్రమవంతుడైన బలఢ్యుడిని” చూశాడు. మన లోపాలను దేవుడు సరిచేసి, తన మహిమ కోసం వాడుకుంటాడు.

​గొప్ప పలుకు (Inspirational Quote)

​”దేవుడు పిలువబడిన వారిని సిద్ధపరచడు, సిద్ధపడిన వారిని పిలవడు; ఆయన ఎంచుకున్న వారిని తానే సిద్ధపరుస్తాడు.”

​ప్రార్థన (Prayer)

​పరిశుద్ధుడైన మా తండ్రి,

నీకు స్తోత్రములు. గిద్యోనును, పేతురును వారి బలహీన స్థితిలో పిలిచి, వారి ద్వారా గొప్ప విజయాలను పొందిన దేవుడవు నీవు. ప్రభువా, ఈ రోజున మేము కూడా అనేకసార్లు మా అశక్తతను చూసి భయపడుతున్నాము. గిద్యోనుకు తోడై ఉన్నట్లు మాకు తోడై ఉండండి. మాకున్న కొద్దిపాటి బలమును నీ ఆత్మ ద్వారా బలపరచండి. లోకపు చూపులకు మేము తృణీకరించబడిన వారముగా ఉన్నా, నీ దృష్టిలో మేము విలువైన వారమని నమ్ముతున్నాము. నీ వాక్యమనే ఖడ్గమును ధరించి, లోకమును జయించే బిడ్డలుగా మమ్మును మార్చమని, మా జీవితాలలో అద్భుతమైన మలుపులు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *