యేసుతో ప్రతి ఉదయము :-
ఈరోజు దేవుని వాగ్దానము:-
“నీవు యెహోవా చేతిలో భూషణకిరీటముగాను ,నీ దేవుని చేతిలో రాజకీయమకుటముగాను ఉందువు” యెషయా 62:3
“నాజనులు యెహోవా దేశములో కిరీటమందలి రత్నములవలె నున్నారు. గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా వారిని రక్షించును” జెకర్యా 9:16
“జ్ఞానుల ఐశ్వర్యము వారికీ భూషణము” సామెతలు 145:24 .జ్ఞానులు వారిజ్ఞానమును బట్టి అతిశయిస్తారు అది వారి ఐశ్వర్యము గాను భూషణముగాను ఉన్నది .నేనైతే నా దేవుడు అనుగ్రహించి రక్షణను బట్టి అతిశయిస్తాను. లోకములో ఎన్ని ఉన్నను. రక్షణకు మించినది ఏదియు లేదు.
అది ప్రశస్తమైనది.దేవుని చేతిలో నుండి మనలను భూషణకిరీటముగా ,రాజకీయమకుటముగా ఆయన చేసి యున్నాడు.
కిరీటము-రాజకీయ మకుటము అధికారమునకు చిహ్నము.ఆయన నన్ను ఆయన రాజ్య వారసుడుగా/వారసురాలిగా నిన్ను,నన్ను అభిషేకించి యున్నాడు.
తన కుమార్తెలంగా/కుమారుడిగా అంగీకరించి యున్నాడు.విడనాడబడిన దానివని ఇకమీదట నీవనబడవు పాడైనదని ఇకను నీదేశమును గూర్చి చెప్పబడదు. “హెప్సిబా ” అని నీకును బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును.యెషయా 62:4
రక్షణను అనుభవిస్తున్న నీకు,నీకున్న ఈలోక సంబంధులు స్నేహితులు నిన్ను విడనాడావచ్చు అయినను నేను అతిశయిస్తున్నాను.
ఎందుకంటే నా దేవుడు వాగ్దానము యిస్తున్నాడు. విడనాడబడిన దాని వాని నీవు అనుకొనవద్దు బిడ్డ! అని దేవుడు నీతో చెప్పుతున్న మాట నీవు ఆలా పిలువబడవు పాడైనది అని నీదేశమును(కుటుంబమును)గూర్చి చేపబడదు.దేవుడు నీకు క్రొత్త పేరు పెడుతున్నాడు. ‘హెప్సిబ” అని బ్యులా అని నీదేశమునకు (కుటుంబమునకు)పేరు పేట్టుచున్నాడు.

Leave a Reply