యేసుతో ప్రతి ఉదయము :-
ఈరోజు దేవుని వాగ్దానము:-
ఏలయనగ అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను. హెబ్రీ 11:26
ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతడికి ప్రత్యక్షమాయెను. నిర్గమ 3:2
దైవజనుడు మోషే జీవితములో మలుపును తెచ్చిన సంఘటన అందరికి తెలుసు. నిర్గమ 3:24 ఇది ఎప్పుడు జరిగెను.? మోషే తన మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చినప్పుడు జరిగేను.దేవుడు మోషేతో మాట్లాడి తన ప్రజలైన ఇశ్రాయేలి్యులను ఐగుప్తు బానిసత్వము నుండి విడిపించుటకు పంపిన సంగతి మనకు విధితమే. మోషే ఆయుష్కాలము 120 సంవత్సరాలు. బైబిల్ పండితులు దీనిని మూడు బాగాములుగా విభజించుచున్నారు. మొదటి 40సంవత్సరాలు గొర్రెల కాపరిగా తన మామయగు యిత్రో మందను మేపుచుండెను. ఇలా చాలా విచిత్రంగా ఉన్నది.
దేవుడు ఎప్పుడు, ఎవరిని, ఎలాగు పిలుస్తాడని ఉహించి తెలుసుకొనలేము. ఫరో భవనములో విదలన్నియు నేర్చుకొనిన మోషే ఒక ఐగుప్తుయుని చంపేను. గనుకఐగుప్తును విడిచి పారిపోయెను. 40సంవత్సరాల కాలము గొర్రెలను మేపిన అనుభవము. 40 సంవత్సరాల కాలము దేవుని ప్రజలను అరణ్యములో నడిపించుటకు దోహదపడేను. రాజభవనములో నేర్చుకొన్న సమస్తమును అరణ్యములో గొర్రెలను మోపుచుండగా అతడు మరచిపోయెను.

Leave a Reply