RECENT POSTS

యేసుతో ప్రతి ఉదయము -DAY 47 – సందేహింపక – నమ్మిన యెడల

యేసుతో ప్రతి ఉదయము:-
ఈరోజు దేవుని వాగ్దానము :-
“తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన యెడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మార్కు 11:23

మత్తయి 17:20 ననుసరించి విశ్వాసము వలన పర్వతములు సహితము పెల్లగించబడును. హెబ్రోను అనగా విశ్వాసము. హెబ్రోను ఆశ్రయ స్థలము కూడా హెబ్రోనుకున్న మూడవ అర్ధము ఆత్మీయముగా బలహీనులుగా నున్న వారి భారములను మనము భరించి,వారు పడిపోయినప్పుడు లేక అపాయములలో నున్నప్పుడు ప్రసవ వేదనతోను,పట్టుదలతోను వారి కొరకు ప్రార్ధించవలెను. ప్రేమ,దయల చేత వారిని పైకి లేవనెత్తవలెను.

నాల్గవదిగా హెబ్రోను అనగా దేవుని మీద సంపూర్ణముగా ఆధారపడుట. దావీదు హెబ్రోనుకు వచ్చినప్పుడు తాను ఖాళీచేయబడి,దీనుడై విరిగి నలిగినా వాడాయెను. ప్రతి విషయములోను దేవుని నడుగుట కారంభిచేను. “నేను వెళ్ళనా ?నేనెక్కడికి వెళ్లవలెను”? అని అడుగుట నేర్చుకొనెను. మన ప్రతి నష్టమును సమకూర్చుకొనుటకిది. నాల్గవ మార్గము. నీ స్వయముపై నాధారపడుట మాని నిన్ను నీవు ఖాళీ చేసికొని ప్రతి విషయము కొరకు దేవుని యొద్ద విచారించుటకై సమయము తీసికొనుము. ని ద్రవ్యమును సహితము ఎలాగు ఖర్చుపెట్టవలెనో ఆయనను అడుగుము.

అదే విధముగా సంఘమునకు సంభందించిన ప్రతి విషయము కూడ దేవుని నడుగవలెను. హెబ్రోనులో మన ప్రతి కదలిక,కార్యమునకు వ్యక్తిగతముగను సమాజముగను దేవుని యొద్ద విచారించి “మేమెక్కడికి వెళ్లవలెను? మేమేమి చేయవలెను?” అని అడుగుటకు నేర్చుకొనెదము.

అనేకులు తమ వివాహ విషయములలో దేవుని చిత్తమును ఎట్లు కనుగొనవలెనో ఎరుగక యున్నారు.అందువలన అనేకమంది విశ్వాసుల జీవితములు నాశనమైపోయి ఆసంతోషకరమైన గృహములను కలిగి యున్నారు.దావీదు కూడ అనేక సంవత్సరములు శ్రమల గుండా వెళ్లిన తరువాతనే “ప్రభువా ఎక్కడికి వేళ్ళ వలెను? ఏమి చేయవలెను ?” అడుగుటకు నేర్చుకొనవలెను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *