యేసుతో ప్రతి ఉదయము- DAY -49-కన్నీటి ప్రార్ధన

యేసుతో ప్రతి ఉదయము :-

DAY – 49-కన్నీటి ప్రార్ధన
ఈరోజు దేవుని వాగ్దానము :-

నీవు కన్నీళ్లు విడచుట చూచితిని;నీ ప్రార్ధన నేనాగీకరించియున్నాను. యెషయా 38:5


కన్నీటి ప్రార్ధన ప్రభావము ఎంతో గొప్పది! ఆనాడు హిజ్కియాకు మరణకరమైన రోగము కలిగెను.” నీవు మరణమవుచున్నావు,బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనుము” అని దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా వర్తమానము పంపెను.యెషయా ప్రకటనను రాజు నమ్మెను. తక్షణము తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్ధించెను. ఆశ్చర్యము! వర్తమానము తెచ్చిన యెషయా నడిమిషాలలో నుండి అవతలకు వెళ్లక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమాయెను.2 రాజులు 20:4

“నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము-ని పితరుల దేవుడైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నీ ప్రార్ధన నేనగీకరించి యున్నాను. నేను నిన్ను బాగుచేసెదను. మూడవ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంక పదునయిదు సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను”. 2 రాజులు 20:5,6 . ఆ ప్రకారమే అద్భుతమైన స్వస్థతతో పాటు ఆయుష్కాలము కూడ పొడిగించెను. దేవుని దేవుని బిడ్డలారా.మీరు వ్యాధి వలన నలిగినా స్థితిలో ఉన్నారా?కుటుంబ బాధ్యత ,సేవ భారము నెరవేర్చలేకపోవుచున్నారని ఆవేదన చెందుచున్నారా? రాజగు హిజ్కియాకు అద్భుతము చేసిన దేవుడు మీకును అద్భుతము చేయును. మంచి ఆరోగ్యమును బలమును దయచేయును.

సాధారణముగా మనలను పరామర్శించుటకు వచ్చు బంధుమిత్రుల మాటలు కొంతవరకు ఉపశాంతి కలిగించవచ్చును గాని ప్రభువు పాదముల చెంత చేరి కన్నీటితో ప్రార్ధించుట మనకు సంపూర్ణమైన ఆరోగ్యము నిచ్చును. యేసుక్రీస్తు తానే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను. మత్తయి 8;17 “ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు.నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించున్నాడు.కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు” కీర్తన 103:4 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనునది మన దేవుని గొప్ప వాగ్దానము. నిర్గమకాండము 15:26

 

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top