ABOUT US

నా రాజేశ్వరి నేను 2020 లో ఒక దర్శనము ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు ఒక మరణకరమైన రోగము నీకు వస్తుంది అయినను బయపడకు నేను నీకు స్వస్థత దేవుడు ఇస్తాను అని మాట్లాడాడు. నేను ఆ సమయములో కరోనా ప్రపంచ అంత ఉంది బహుశా నాకు కూడా కరోనా వస్తుందేమో అందుకే దేవుడు ముందు నాకు చూపించాడు అని అనుకున్నాను. కానీ కరోనా 1,2,3 అని వేవ్స్ అయిపోయిన నాకు కరోనా రాలేదు కానీ ఆ సమయములో దేవుడు నాకు వెబ్సైటు డిజైన్ చేయడం నేర్పించాడు. ఆర్టికల్స్ రాయడం చేశాను. కానీ ఆర్ధిక ఇబ్బందుల వలన ఒక స్కూల్ టీచర్ గా జాయిన్ అయ్యాను. అనుకొంకుండా ఫిబ్రవరి 24 రాత్రి నాకు కడుపు నొప్పి తో హాస్పిటల్ కి వెళ్ళాను అప్పుడు నా ముందు మరణదూత కనిపించింది నాకు గుర్తుకు వచ్చింది దేవుడు ఇచ్చిన తలాంతును,సేవను ప్రక్కన పెట్టి స్కూల్ టీచర్ గ చేస్తున్నాను అని వెంటనే పశ్చత్తాపముతో దేవునికి ప్రార్ధన చేశాను ….దేవుడు నాతో మాట్లాడి నేను నిన్ను స్వస్థపరచెను అని వారు నిన్ను 30 నిమిషముల కన్నా ఎక్కువ ఉంచుకోరు. కానీ కడుపు నొప్పి ఎందుకు వచ్చింది అని డాక్టర్స్ దగ్గరకు వెళ్ళాము కానీ మొదట కొన్ని టెస్ట్ లు రాసారు వాటిలో క్లియర్ గా ఏమి లేదు . మరొక పెద్ద హాస్పిటల్ కి వెళ్ళాము ఆసియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ దాదాపు మార్చి 27 తారీఖున తెలిసింది నాకు అండాశయ కాన్సర్ అది కూడా 4 అడ్వాన్స్ బి గ్రేడ్ అని …… ఏ ప్రాసెస్ అంతటి లో దేవుడు తన వాగ్దానము లతో నన్ను నడిపించాడు. నా సాక్ష్యము కొంచెముగా ఇచ్చాను