యేసుతో ప్రతి ఉదయము -39 కన్నీటిని తుడుచు ప్రభువు
ఆయన వారి కన్నుల ప్రతి భాష్పభిందువును తుడిచివేయును…. దుఃఖమైనను, ఏడపైనను వేదనైనను ఇక ఉండదు. ప్రకటన 21:4
క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని గూర్చిన వివరణ ప్రకటన గ్రంధము యొక్క 21 అధ్యముమందు వ్రాయబడియున్నది. అందువలన అంతవరకు కన్నీళ్లు, ఏడుపు, వేదన, దుఃఖము, మరణము ఉంటుందని గ్రహించుచున్నాము. అయినను ఈ లోకమందు జీవించు చుండగానే ప్రభువు మన కన్నీటిని తుడుచుచున్నాడు అనునది నిజము. బైబిల్ గ్రంధమందలి పరిశుద్దులందరు కన్నీటి మార్గమున నడచిరి. “వారు బాకా లోయలో పడి వెళ్లుచు దానిని జలమయముగా చేయుదురు ” కీర్తనలు 84:6. బాకా అనగా కన్నీటి లోయ. “కన్నీళ్లు విడుచుచు వితువారు సంతోషాగానము చేయుచు పనలు మోసికొనివచ్చును ” కీర్తనలు 126:5,6 ఇది వారి అనుభవముగా ఉండును.
దేవుని బిడ్డలారా, మీరు కన్నీరు కార్చుచుండగా మీకు ఒక ఆదరణ కలదు. మృత్యుంజయుడై లేచిన క్రీస్తు మీ కన్నీటిని సంపూర్ణముగా తుడిచి వేయును అను నిరీక్షణ కలదు. “సింహాసన మధ్యమాందుండు గొర్రెపిల్ల వారికి కాపరియై, జీవజలముల బుగ్గలయొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నులనుండి ప్రతి భాష్పాభిందువును తుడిచి వేయును “ప్రకటన 7:17
పాత నిభందన గ్రంధమందును ఇందుకు సంబంధించిన ప్రస్తావన ఉన్నది.”మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన తుడుచువేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమిది భాష్పాభిందువులను తుడిచివేయును భూమిమీదనుండి తన జనుల నిందను తీసివేయును “యెషయా 25:8 దేవుని బిడ్డలారా, సంతోషమును ఓర్వలేని సాతాను అయ్యారితులలో వేదన దుఃఖమును కలుగజేయుచున్నాడు.
లోకమందు జన్మించు ప్రతి మనుష్యుడు ఏడుచుచ్చునాడు, కన్నీరు కార్చుచున్నాడు. అతడు మరణించునప్పుడు బంధు మిత్రులు అతని కొరకు ఏడుస్తున్నారు. ఇలాగునా ఏడుపు, కన్నీరు అనునవి అనుదిన జీవితంలో ఒక భాగముగా ఉన్నది. అదే సమయంలో తన జన్మ, కర్మ పాపములను గ్రహించువాడై పశ్చతపముతో కార్చు కన్నీరు కలదు. నింద, అవమానము వలన, కష్టానష్టముల వలన, వ్యాధి వలన కార్చు కన్నీరు కలదు.



