యేసుతో ప్రతి ఉదయము:-
ఈరోజు దేవుని వాగ్దానము:-
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి. మూలకు తలరాయి ఆయెను. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. కీర్తనలు 118:22,23
ఇల్లు కట్టువారు నిర్మాణము కొరకు వాడుతున్న ప్రతి దానిని పరీక్షించి చూచేదరు. ముఖ్యముగా నాణ్యమైన వాటిని ఎన్నుకొనెదరు. నిర్మాణము కొరకైన రాళ్ల విషయములో కొన్నిటిని నిషేధించుట సహజము. అలాగే నిషేదించబడిన ఒక రాయి కట్టబడు భవనమంతటిని మోయు మూలరాయిగా మారిన పక్షముగా అది నిశ్చయముగా ఆశ్చర్యకరమే!ఆత్మ స్వరూపియగు దేవుడు సశారీరుడుగా ప్రత్యక్షమైనప్పుడు రక్షకుడని జనములో ప్రకటింపబడెను. 1 తిమోతి 3:16.అదే సమయమున ఆయన తృణికరీంపబడెను, మనుష్యుల వలన విసర్జింపబడేను.యెషయా 53:3.
ఆనాడు మత నాయకులు క్రీస్తును ఆయారితులలో విమర్శించిరి. వడ్లవాని కుమారుడు అని సంబోదించిరి. పాపులు మరియు సుంకరులు స్నేహితుడు, భోజన ప్రియుడు, బయల్జే బుల ద్వారా దయ్యములను వెళ్లగొట్టువాడు, మతిచలించినవాడు అని పరిహరించిరి. ఇది ఇలాగునుండగా ఏమి జరిగేను? “అందుచేత పరలోకమాందున్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రీయైన దేవుని మహిమర్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొను నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించేను “. ఫిలిప్పీ 2:9,10,11

Leave a Reply