యేసుతో ప్రతి ఉదయము-DAY 36

యేసుతో ప్రతి ఉదయము:-

ఈరోజు దేవుని వాగ్దానము :-

నేనిచ్చు నీళ్లు త్రాగు వాడేయిప్పుడును దప్పి గొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండును. యోహాను 4:14

నేను అలసి ఉన్నాను ;ఆ యెఱ్ఱ యెఱ్ఱగా నున్న దానిలో కొంచెం దయచేసి నాకుపెట్టుమని అడిగెను. అదికాండము 25:30

శరీరాశ, నేత్రశ, జీవపుడంభము అనునవి సాతాను యొక్క బలమైన ఆయుధములుగా ఉన్నవి.ఆ దినమున యాకోబు కాలగూర వంతకము వండుకొను చుండగా పొలము నుండి వచ్చిన ఏశావు శోదించబడేను. యాకోబు కుయుక్తిగా -నీ జేష్టత్వము నేడు. నాకు ఇవ్వమని అడిగెను. ఏశావు నోట నుండి వచ్చిన మాటను చుడండి నేను చావబోచున్నాను కదా, జెష్టత్వము నాకెందుకు అనెను “. ఒక పూట తినకపోయినంత మాత్రములో ఎవరు చనిపోరు గాని తన శరీరాశాను బట్టి ఏశావు ఇలాగున మాట్లాడేను. శరీర సంబంధమైన ఆకలి కలిగియుండిన ఏశావునకు ఆత్మ సంబంధమైన ఆకలి ఎంత మాత్రము లేకుండేను.

పూర్తిగా దేవుని మరచి జీవించువారు -నా కొరకు ఏ దీవెన యైనను మిగిల్చి యుంచలేదా అని ఆవేదనతో అడుగుదురు. సాధారణముగా తాతల చరిత్రను మనుమ సంతానమునకు చెప్పుట అనవయితీ. అబ్రాహాము తన సోదరుడు కుమారుడైన లోతును విడిపించుటకు యుద్ధము చేసేను. జయము పొందిన వారు తిరిగి వచ్చుచుండగా సర్వోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కిసేదకు రొట్టెను ద్రాక్షరసమును అబ్రాహామునకు ఇచ్చి ఆశీర్వదించెను. అప్పుడు అబ్రాహాము తన రాబడి అంతటిలో పదియవ వంతు ఇచ్చెను. ఆదికాండము 14:20 బహుశా ఇందును గూర్చి ఏశావు వినియుండవచ్చు.

ONE YEAR BIBLE READING PLAN:-

  1. లెవియకాండము 11-13 అధ్యాయములు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *