G-DYR27RHXFV dir="ltr" itemscope="itemscope" itemtype="http://schema.org/WebPage">
PRAYERS TO THE WORLD

POWER OF PRAYER

Archives

  • February 2026
  • January 2026
  • December 2025

Categories

  • Blog
  • BLOG
  • యేసుతో ప్రతి ఉదయము
  • HOME
  • ABOUT US
  • CONTACT US
  • PRAYER REQUEST
  • SERVICES
    • యేసుతో ప్రతి ఉదయము
    • యేసుతో ప్రతి ఉదయము-DAY9
    • యేసుతో ప్రతి ఉదయము- DAY 8
    • యేసుతో ప్రతి ఉదయము- DAY 7
    • యేసుతోప్రతి ఉదయము-DAY 6
    • యేసుతో ప్రతి ఉదయము-DAY 5
    • యేసుతో ప్రతి ఉదయం-DAY -4
    • యేసుతో ప్రతి ఉదయం-DAY 3
    • యేసుతో ప్రతి ఉదయం- DAY 2
    • యేసుతో ప్రతి ఉదయం – DAY 1
    • మిషనరీ బయోగ్రఫీ
      • డేవిడ్ లివింగ్ స్టన్ (1813 – 1873)
        • ప్రాణాలకే తెగించించిన సేవకుడు
  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY

చీకట్లో దాచబడిన నిధులు

యేసుతో ప్రతి ఉదయం-DAY22-చీకట్లో దాచబడిన నిధులు

January 23, 2026 by banturajeshwari67 Leave a Comment

యేసుతో ప్రతి ఉదయం:-

ఈరోజు దేవుని వాగ్దానము:-

అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను  రహస్య స్థలములలోని మరుగైన ధనము నీకిచ్చేదెను. యెషయా 45:3

చీకట్లో దాచబడిన నిధులు:-

అంధకార స్థలములలో నిధులు అంటే ఏమిటి?

సాధారణంగా నిధులు లేదా బంగారము భూమి లోపల చీకటిగా ఉన్న గన్నుల్లో ఉంటాయి. వాటిని వెలికి తీయాలంటే శ్రమించాలి అలాగే మన జీవితంలో అంధకార స్థలములు అంటే మనం ఎదుర్కొనే కష్టాలు కన్నీళ్లు ఒంటరితనం లేదా శోధనలు. 

  • లోకం దృష్టిలో అది కేవలం చీకటి మాత్రమే 
  • కానీ దేవుని దృష్టిలో ఆ కష్టాకాలంలోనే ఆయన మనకు ఓర్పు విశ్వాసం మరియు ఆయన సానిధ్యాన్ని అనే నిధులు అనుగ్రహిస్తాడు 

రహస్య స్థలములలోని ధనము:-

 కొన్ని ​​పాఠాలు మనకు సంతోషంగా ఉన్నప్పుడు అర్థం కావు కన్నీటి లోయలు నడుస్తున్నప్పుడే దేవుడు తన రహస్యాలను మనకు వెల్లడిస్తాడు. లోకానికి మరుగైన శాంతి లోకానికి తెలియని ధైర్యం నీకు లభిస్తాయి. నువ్వు ఒంటరిగా ఉన్నావని అనుకున్న చోటే దేవుడు తన కృపా నీకు చూపిస్తాడు. 

పేరు పెట్టి పిలిచే దేవుడు:- 

ఈ వచనంలో ఒక గొప్ప మాట ఉంది నీ పేరు పెట్టి నిన్ను పిలిచిన విశ్వమంతా సృష్టిని దేవుడు నిన్ను గుంపులో ఒకటిగా ఒకరిగా చూడటం లేదు. నీ పేరు ఆయనకు తెలుసు నీ కష్టమేమిటో ఆయన తెలుసు. ఆఅంధకారం నుండి నిన్ను బయటకు తీసుకొని రావడమే కాదు ఆశీర్వదించి పంపడం ఆయన ప్రణాళిక. 

ఆయన గాఢాంధకారములోని మర్మములను బయలుపరచును మరణాందుకారమును వెలుగులోనికి 

తెచ్చును – యోబు 12 22 

నువ్వు ఇప్పుడు చీకట్లో ఉన్నామని భయపడకు నాకు చీకట్లోనే దేవుడు నీకోసం నీకోసం ఒక పెద్ద ఆశీర్వాదని సిద్ధం చేసి ఉంచాడు

జీవిత కథ 

చీకటి గనిలో దొరికినది ఒకప్పుడు దక్షిణాఫ్రికాలోని ఒక లోతైన వజ్రాల గనిలో ఒక ప్రమాదం జరిగింది ప్రమాదవశాత్తు భూమికి కొన్ని వందల అడుగులలో ఒక చీకటి గది లాంటి ప్రదేశంలో చిక్కుకుపోయాడు పై నుండి మట్టి పడిపోవడంతో బయటకు వచ్చే మార్గం మూసుకుపోయింది చీకటిలో నిరీక్షణ పీటర్ దగ్గర ఉన్న చిన్న టార్చ్ లైట్ కూడా కొద్దిసేపటికి ఆగిపోయింది చుట్టూ భయంకరమైన అంధకారం ఊపిరి ఆడటం కష్టమైపోతుంది.

 నేను ఇక్కడే చనిపోతానేమో నా జీవితం ముగిసిపోయింది అది పీటర్ భయంతో వణికిపోయాడు ఆ చీకటిలో అతనికి తన చిన్నతనంలో చదువుకున్న వాక్యం గుర్తొచ్చింది అంధకార స్థలంలలో ఉంచబడిన నిధులను ఇచ్చెదను అతడు మోకరిల్లి ప్రభువా ఈ చీకటిలో నాకు ఏ నిధి కనిపిస్తుంది ?నన్ను ప్రాణాలతో బయటకు పడే అని కన్నీళ్ళతో ప్రార్థించడు.

 

కొన్ని గంటల తర్వాత పీటర్ తన చేతులతో పక్కన ఉన్న మట్టిని తవ్వుతుండగా అతని చేతికి ఏదో గట్టిగా తగిలింది తన దగ్గర ఉన్న అగ్గిపెట్టి వెలిగించి చూస్తే అది ఒకసారి లాగా ఉంది కానీ అది సామాన్యమైన రాయి కాదు అది ఆ గనిలోనే అత్యంత విలువైన ఆవిష్కృతమైన వజ్రం చివరికి రెస్క్యూటివ్ వారు పీటర్ ను రక్షించి బయటకు తీశారు పీటర్ బయటకు వచ్చేటప్పుడు ప్రాణాలతో రావడమే కాకుండా తనతో పాటు ఆ విలువైన వజ్రాన్ని కూడా తీసుకువచ్చాడు ఆ ఒక్క వచనం అతని దరిద్రాన్ని పూర్తిగా తుడిచివేసింది

 

 పీటర్ జీవితంలో ఆ భయంకరమైన చీకటి రాకపోయి ఉంటే అతనికి ఆ విలువైన వజ్రం దొరికేది కాదు. మన జీవితంలో కూడా అనారోగ్యం ఆర్థిక ఇబ్బందులు లేదా అవమానాలు అనే చీకటి గనులు ఎదురైనప్పుడు మనం భయపడతాం కానీ దేవుడు ఆ చీకటిలోనే మనకోసం ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు.

 

  • నీకు కష్టం రాకముందు దేవుడు ఎవరో నీకు సరిగా తెలియకపోవచ్చు కానీ ఆ కష్టంలోనే ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచే దేవుడు అన్ని అర్థమవుతుంది.
  • నీ కన్నీళ్లే రేపు నీ విజయానికి పునాది అవుతాయి

 

గొప్ప పలుకులు 

  • నక్షత్రాలు మెలవాలంటే చీకటి ఉండాలి. నీ జీవితంలోని మహిమ కనిపించాలన్న కొన్నిసార్లు అంధకారం తప్పదు.
  •  దేవుడు నిన్ను చీకటి గదిలోకి పంపాడు అంటే అక్కడ నీకోసం ఒక అద్భుత బహుమానం దాచడమే అర్థం. 

 

సందేశం ముగింపు 

నీ జీవితంలో ప్రస్తుతం ఏదైనా సమస్య ఆర్టిక ఇబ్బందుల లేదా మానసిక వేదన నేను వేధిస్తున్నాయా అయితే ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకో ప్రభువా నీవు దాచిన నిధులు నాకు చూపించు అని ప్రార్ధించు ఆయన నిన్ను పేరు పెట్టి పిలిచి నేను ఆశ్చర్యకరమైన వెలుగులని నడిపిస్తాడు.

 

ప్రార్థన 

పరలోకపు తండ్రి చీకటిలో ఉన్న నిధులను నాకు ఇస్తానని విచ్చేసిన వాగ్దానాన్ని బట్టి వందనాలు నేను కృంగిపోకుండా నీవు నా కోసం దాచిన ఆత్మీయతనాన్ని పొందుకునేలా నా కళ్ళను తెరవండి నన్ను పేరు పెట్టి పిలిచి నా నీ ప్రేమకు వందనాలు ఆమెన్

Posted in: యేసుతో ప్రతి ఉదయము, Blog Tagged: చీకట్లో దాచబడిన నిధులు

Recent Posts

  • యేసుతోప్రతిఉదయము-DAY 33 దేవుని కన్ను మీపై ఉంది
  • యేసుతో ప్రతి ఉదయము DAY 32/విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు
  • యేసుతో ప్రతి ఉదయము-DAY 31-ఎడారి జీవితంలో వసంతం
  • యేసుతో ప్రతి ఉదయము-DAY 30-విశ్వాసి ఆయుధం: క్రీస్తు నామము
  • యేసు ప్రతి ఉదయము-DAY 29-“నూతన బలము – ఆత్మీయ పునరుజ్జీవనం”

Recent Comments

  1. Satya on యేసుతో ప్రతి ఉదయము DAY 32/విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు
  2. SatyaValli on యేసుతో ప్రతి ఉదయము-DAY 28 పునరుద్ధరణ: పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుట

Copyright © 2026 PRAYERS TO THE WORLD.

Church WordPress Theme by themehall.com

G-DYR27RHXFV