యేసుతో ప్రతి ఉదయము DAY 32/విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు
యేసుతో ప్రతి ఉదయము:-
ఈరోజు దేవుని వాగ్దానము:-
అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా 45:3
“విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు”

మనకు సంపాదించడానికి ఆయన సిలువ మరణం పొందాడు. అలాంటి తండ్రి ఎప్పుడైనా నిన్ను విడిచిపెడతాడు?
తనతో పాటు మనకు అన్నిటిని ఉచితంగా ఎందుకు ఇవ్వడు ?
అవిశ్వాసి బాష =”ఎలా ఇస్తాడు “
విశ్వాసి బాష =”ఎందుకు ఇవ్వడు “
మీ జీవితాలలో దేవుని కార్యాలకు మొదటి స్థానం ఇస్తే మీ భవిష్యత్తులో అవసరమైన అవసరతలను అయన తీరుస్తాడు.మొదట ఆయన రాజ్యమును,నీతిని వెదికితే మీ జీవితావసరాలను కొరత లేకుండా చూసుకుంటాడు.
దేవుడు తన ప్రజల అవసరాన్ని తీర్చాడు.ఆయన ఐశ్వర్యం నుండి కాకుండా, యేసు క్రీస్తు ద్వారా మహిమలో ఉన్న తన ఐశ్వర్యాన్ని బట్టి అనుగ్రహిస్తాడు.
- ఈ సంవత్సరములో నాకు ఒక మంచి ఉద్యోగం దొరకదా?
- నా జీతము పెరగదా?
- ప్రమోషన్ రాదా?
- యువతీ,యువకులు -నాకు సరిపడా వివాహ సంబంధము దొరకదా?
- అనియు వివాహమైన వారు – నాకు సంతాన భాగ్యము కలుగదా?
- అనియు ఆశతో ఎదురు చూడవచ్చు.
మహోన్నతమైన దేవుని వద్ద నుండి మనము పొందుచున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము లోకానుసారమైన ధననిధి కంటె బహు
చిన్నకథ:-
ఒక అడవిలో ఒక పక్షి తన గూడు కట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ అక్కడ విపరీతమైన గాలి వాన మొదలైంది. ఆ పక్షి భయపడకుండా ఒక పెద్ద చెట్టు కొమ్మ చాటున తలదాచుకుంది. వాన తగ్గాక చూస్తే, ఆ గాలికి ఒక పాత చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు లోపల ఒక పెద్ద తేనెపట్టు, పండ్లు దాగి ఉన్నాయి. ఆ పక్షి కష్టపడకుండానే దానికి కావలసిన ఆహారం లభించింది.
నీతి: మన జీవితంలో చీకటి రోజులు (కష్టాలు) వచ్చినప్పుడు, దేవుడు మన కోసం “రహస్య స్థలాలలో ధనాన్ని” దాచి ఉంచుతాడు. మనం ఆయనపై నమ్మకం ఉంచితే, కష్టాల వెనుక ఉన్న దీవెనలను ఆయన బయలుపరుస్తాడు.
అనుదిన ఆత్మీయ పలకులు
- విశ్వాసపు పలుకు: “ఎలా ఇస్తాడు?” అని అడగడం లోకం రీతి… “నా తండ్రి నాకు ఎందుకు ఇవ్వడు?” అని ధీమాగా ఉండటం విశ్వాసి నీతి!
- సిలువ ప్రేమ: మన కోసం ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు, మనకు అవసరమైన లోక ధనాన్ని ఇవ్వకుండా దాచుకుంటాడా? ఆయన ప్రేమలో కొరత లేదు, నీ విశ్వాసంలో వెలితి ఉండకూడదు.
- ధైర్యపు పలుకు: లోకం నిన్ను చీకటిలో నెట్టేయాలని చూస్తుందేమో, కానీ దేవుడు ఆ అంధకారంలోనే నీ కోసం ‘మరుగైన ధనాన్ని’ దాచి ఉంచాడు. ధైర్యంగా ఉండు!
- జీవన సూత్రం: నీ అవసరాల వెనుక నువ్వు పరిగెత్తకు; దేవుని రాజ్యము వెనుక నువ్వు పరిగెత్తు, నీ అవసరాలే నీ వెనుక వస్తాయి.
- ఆయన ఐశ్వర్యం: దేవుడు తన దగ్గర ఉన్న ‘కొంత’ ఇవ్వడు… తన మహిమలో ఉన్న ఐశ్వర్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు
“నేటి నుండి నా ప్రార్థన ‘అది కావాలి, ఇది కావాలి’ అని కాదు… ‘ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చే శక్తిని ఇవ్వు, నా అవసరాలు నీకు తెలుసు’ అని మారుద్దాం.”
ప్రార్థన: “ప్రభువా, సందేహించే మనసును తీసివేసి, ‘నీవు ఎందుకు ఇవ్వవు?’ అని అడిగే గొప్ప విశ్వాసాన్ని నాకు ప్రసాదించు. నీ రాజ్యానికి నా జీవితంలో మొదటి స్థానం ఇస్తాను.” యేసు క్రీస్తు నామములో ప్రార్ధిస్తున్నాము తండ్రి,ఆమెన్ .
