యేసుతో ప్రతి ఉదయము:-
ఈ రోజు దేవుని వాగ్దానము:-
“నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు.”
— యెషయా 54:17
నేటి ధ్యానం (Daily Devotion)
నిర్దోషత్వం – దేవుని రక్షణకు తాళం చెవి
https://youtu.be/NDyV1QXFJyI?si=2Suce4b-AGkW93Gy
నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి,సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దానియేలు 6:22
దానియేలు జీవితము యొక్క విజయ రహస్యములు అతడు వర్ధిల్లుటకు కారణమయ్యెను.
- పరిశుద్ధత
- ఉమ్మడి ప్రార్థన
- నిర్దోషిగా జీవించుట.
రాజకు దర్యావేషు 120 మందిని అధిపతులుగా నియమించెను. వారిపై ముగ్గురిని ప్రధానులుగా నియమించెను.
ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. ఎప్పుడైతే రాజు దానియేలును రాజ్యమంతటి మీద నియమింపవలెనని ఉద్దేశించెనో, అధిపతులను ప్రధానులను దానియేలు జీవితములో లోపములను కనుగొనుటకు కనుగొనుటకు ప్రయత్నించిరి
దానియేలు జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పిస్తుంది: నీతిగా బ్రతికేవారి పక్షాన దేవుడు పోరాడుతాడు. లోకంలో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూసే “సింహాల” వంటి వ్యక్తులు లేదా పరిస్థితులు ఉండవచ్చు. కానీ, మనం దేవుని దృష్టికి నిర్దోషులుగా, నమ్మకస్థులుగా ఉన్నప్పుడు, శత్రువుల కుతంత్రాల మధ్య కూడా దేవుడు మనకు రక్షణ కవచంగా నిలుస్తాడు. లోకపు చట్టాలు మనకు వ్యతిరేకంగా ఉన్నా, పరలోకపు దేవుడు మనల్ని విడిపించడానికి తన దూతలను పంపుతాడు.
“నేను నీకు తోడైయున్నాను, భయపడకుము; నేను నీ దేవుడనై యున్నాను, దిగులుపడకుము.” (యెషయా 41:10)
దానియేలును సింహాల బోనులో రక్షించిన దేవుడు, ఈ రోజంతా మీకు తోడుగా ఉండి నడిపించును గాక!
విజయము: మీ పనులలో ఎదురయ్యే ఆటంకాలను దేవుడు తొలగించును గాక.
రక్షణ: ఏ కీడు మీ దరి చేరకుండా, ఆయన తన దూతలను మీకు కాపుదలగా ఉంచును గాక.
సమాధానము: శత్రువుల మధ్య కూడా మీరు ధైర్యంగా, ప్రశాంతంగా ఉండేలా దేవుడు తన కృపను అనుగ్రహించును గాక.
విశ్వాసంతో ఈ చిన్న మాటను పలకండి:
“నా దేవుడు గొప్పవాడు, ఆయన నన్ను ఎన్నడూ చేయి విడువడు. ఆమెన్!”
“నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు.”
— యెషయా 54:17
ప్రభువు మనకు ఇస్తున్న అభయం:
“దేవుడు సింహాలను చంపలేదు…
కాని సింహాల నోళ్లను మూయించాడు.”
దానియేలును సింహాల నోటికి చిక్కకుండా కాపాడిన దేవుడే ఈరోజు నీకు తోడుగా ఉన్నాడు. నీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మనుషులు నీపై కుట్రలు పన్నవచ్చు, నిందలు వేయవచ్చు. కానీ గుర్తుంచుకో…
దేవుడు నీ పక్షాన ఉంటే: ఏ శక్తీ నిన్ను ఆపలేదు.
ఆయన కాపుదల ఉంటే: సింహాల వంటి భయంకరమైన సమస్యలైనా నీ ముందు నోరు విప్పలేవు.
నీ నీతి నిన్ను కాపాడుతుంది: నీవు దేవుని దృష్టికి యథార్థంగా ఉంటే, నీ శత్రువుల ఎదుటే ఆయన నీకు విజయమును అనుగ్రహిస్తాడు.
ఈ రోజంతా దేవుని కృప నీకు తోడుగా ఉండును గాక!
ఆమేన్.
చిన్న కధ (Life Application Story):
రమేష్ అనే క్రైస్తవ యువకుడు ఒక ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఆఫీసులో చాలా మంది అబద్ధాలు చెప్పి, షార్ట్‌కట్ మార్గాలు ఎంచుకుని ప్రమోషన్లు పొందేవారు. రమేష్ మాత్రం దేవుని భయంతో నిజాయితీగా పనిచేసేవాడు.
ఒక రోజు పెద్ద ప్రాజెక్ట్‌లో జరిగిన తప్పును రమేష్‌పై నెట్టేశారు. మేనేజర్ ముందు అతనికి మాట చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదు. ఆ రోజు అతడు చాలా బాధపడ్డాడు. కానీ ఆ రాత్రి దేవుని ఎదుట ప్రార్థన చేస్తూ ఇలా అన్నాడు:
“ప్రభువా, నీవు నా హృదయాన్ని తెలుసు. నేను తప్పు చేయలేదని నీకు తెలుసు.”కొన్ని రోజులకు ఆఫీస్ ఆడిట్ జరిగింది. సిస్టమ్ రికార్డులు చెక్ చేసినప్పుడు నిజమైన తప్పు చేసినవారు బయటపడ్డారు. రమేష్ నిర్దోషి అని అందరికీ తెలిసింది. మేనేజర్ అతనిని క్షమాపణ కోరాడు.
లైఫ్ అప్లికేషన్:
రమేష్ పరిస్థితి దానియేలు పరిస్థితిలాంటిదే.ఆఫీసు, కుటుంబం, సమాజం – ఎక్కడైనా మనపై తప్పుడు ఆరోపణలు రావచ్చు.కానీ మన జీవితం దేవుని ఎదుట యథార్థంగా ఉంటే,మనలను మింగాలని చూసే “సింహముల నోళ్లను” దేవుడు మూయిస్తాడు
మనుషుల ఎదుట కాకుండా దేవుని ఎదుట నిజాయితీగా జీవించాలి.తప్పు చేయకపోయినా నిందలు వస్తే దేవుని ఎదుట మౌనంగా నిలబడాలి.మన రక్షణకు దేవుడు సరైన సమయాన్ని ఎంచుకుంటాడు.నిర్దోష జీవితం దేవుని అద్భుతాలకు దారి తీస్తుంది.
గొప్ప సేవకుల పలుకులు:
బిల్లీ గ్రాహం:
“నీతిగా జీవించడం కష్టం అయినా, దాని ఫలితం శాశ్వతం.”
చార్లెస్ స్పర్జన్:
“దేవుడు తన పిల్లలను నిందల మధ్య కూడా కాపాడగలడు.”
ప్రార్థన:
ప్రియమైన ప్రభువా,
ఈ లోకంలో నేను ఎదుర్కొనే ప్రతి అపవాదంలో
నన్ను నీ దృష్టిలో నిర్దోషిగా నిలబెట్టుము.
నన్ను మింగాలని చూసే సమస్యల నోళ్లను
నీ శక్తితో మూయించుము.
నిన్ను నమ్మే విశ్వాసంలో నన్ను నిలిపి ఉంచుము.
యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి,
ఆమేన్.
ONE YEAR BIBLE READING PLAN
ఆదికాండము 27-29 అధ్యాయములు
ఆదికాండము 27:1
ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా, అని అతని పిలువగా అతడుచిత్తము నాయనా అని అతనితో ననెను.
ఆదికాండము 27:2
అప్పుడు ఇస్సాకుఇదిగో నేను వృద్ధుడను, నా మరణదినము నాకు తెలి యదు.
ఆదికాండము 27:3
కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసికొని అడవికి పోయి నాకొరకు వేటాడి మాంసము తెమ్ము.
ఆదికాండము 27:4
నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నాయొద్దకు తెమ్మని చెప్పెను.
ఆదికాండము 27:5
ఇస్సాకు తన కుమా రుడగు ఏశావుతో ఇట్లు చెప్పుచుండగా రిబ్కా వినుచుండెను. ఏశావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్లెను.
ఆదికాండము 27:6
అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచిఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో
ఆదికాండము 27:7
మృతి బొందకమునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించునట్లు నాకొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజ్యములను సిద్ధ పరచుమని చెప్పగా వింటిని.
ఆదికాండము 27:8
కాబట్టి నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము.
ఆదికాండము 27:9
నీవు మందకు వెళ్లి రెండు మంచి మేక పిల్లలను అక్కడనుండి నాయొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను అతనికి చేసె దను.
ఆదికాండము 27:10
నీ తండ్రి మృతిబొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించునట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసికొనిపోవలెననెను.
ఆదికాండము 27:11
అందుకు యాకోబునా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్ననివాడను గదా.
ఆదికాండము 27:12
ఒకవేళ నాతండ్రి నన్ను తడవిచూచును, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడనుగా తోచినయెడల నా మీదికి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చు కొననని చెప్పెను.
ఆదికాండము 27:13
అయినను అతని తల్లినా కుమారుడా, ఆ శాపము నా మీదికి వచ్చునుగాక. నీవు నా మాటమాత్రము విని, పోయి వాటిని నాయొద్దకు తీసికొని రమ్మని చెప్పగా
ఆదికాండము 27:14
అతడు వెళ్లి వాటిని తన తల్లియొద్దకు తీసికొనివచ్చెను. అతని తల్లి అతని తండ్రి కిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపఱచెను.
ఆదికాండము 27:15
మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక
ఆదికాండము 27:16
రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి ఆ మేకపిల్లల చర్మములతో అతని చేతులను అతని మెడమీద నునుపు భాగమును కప్పి
ఆదికాండము 27:17
తాను సిద్ధపరచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతి కియ్యగా
ఆదికాండము 27:18
అతడు తన తండ్రియొద్దకు వచ్చినా తండ్రీ, అని పిలువగా అతడుఏమి నా కుమారుడా, నీ వెవరవని అడిగెను
ఆదికాండము 27:19
అందుకు యాకోబునేను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడను, నీవు నాతో చెప్పినప్రకారము చేసియున్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచికూర్చుండి, నేను వేటాడి తెచ్చినదానిని తినుమనెను.
ఆదికాండము 27:20
అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీ కెట్లు దొరికెనని అడుగగా అతడునీ దేవుడైనయెహోవా నా యెదుటికి దాని రప్పించుటచేతనే అని చెప్పెను.
ఆదికాండము 27:21
అప్పుడు ఇస్సాకు నా కుమారుడా, నీవు ఏశా వను నా కుమారుడవో కావో నేను నిన్ను తడవి చూచె దను దగ్గరకు రమ్మని చెప్పెను.
ఆదికాండము 27:22
యాకోబు తనతండ్రియైన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడవిచూచిస్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను.
ఆదికాండము 27:23
యాకోబు చేతులు అతని అన్నయైన ఏశావు చేతులవలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గురుతు పట్టలేక అతనిని దీవించి
ఆదికాండము 27:24
ఏశావు అను నా కుమారుడవు నీవేనా అని అడుగగా యాకోబునేనే అనెను.
ఆదికాండము 27:25
అంతట అతడు అది నాయొద్దకు తెమ్ము; నేను నిన్ను దీవించునట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందు ననెను; అతడు తెచ్చినప్పుడు అతడు తినెను; ద్రాక్షారసము తేగా అతడు త్రాగెను.
ఆదికాండము 27:26
తరువాత అతని తండ్రియైన ఇస్సాకు నా కుమారుడా, దగ్గరకువచ్చి నన్ను ముద్దు పెట్టు కొమ్మని అతనితో చెప్పెను.
ఆదికాండము 27:27
అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దుపెట్టుకొనెను. అప్పుడతడు అతని వస్త్రములను వాసనచూచి అతని దీవించి యిట్లనెను. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసనవలె నున్నది.
ఆదికాండము 27:28
ఆకాశపుమంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీ కనుగ్రహించుగాక
ఆదికాండము 27:29
జనములు నీకు దాసులగుదురు జనములు నీకు సాగిలపడుదురు నీ బంధుజనులకు నీవు ఏలికవై యుండుము నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు నిన్ను శపించువారు శపింపబడుదురు నిన్ను దీవించువారు దీవింపబడుదురుగాక
ఆదికాండము 27:30
ఇస్సాకు యాకోబును దీవించుటయైన తరువాత యాకోబు తన తండ్రియైన ఇస్సాకు ఎదుటనుండి బయలు దేరి వెళ్లిన తక్షణమే అతని సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను.
ఆదికాండము 27:31
అతడును రుచిగల భోజ్యములను సిద్ధపరచి తన తండ్రియొద్దకు తెచ్చినా తండ్రీ నన్ను దీవించునట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినదాని తినుమని తన తండ్రితోననెను.
ఆదికాండము 27:32
అతని తండ్రియైన ఇస్సాకునీ వెవర వని అతని నడిగి నప్పుడు అతడునేను నీ కుమారుడను ఏశావు అను నీ జ్యేష్ఠకుమారుడననగా
ఆదికాండము 27:33
ఇస్సాకు మిక్కు టముగా గడగడ వణకుచు అట్లయితే వేటాడిన భోజ్య మును నాయొద్దకు తెచ్చినవారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని, అతడు దీవింపబడినవాడే యనెను.
ఆదికాండము 27:34
ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసిఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.
ఆదికాండము 27:35
అతడునీ సహోదరుడు కపటోపాయ ముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసికొనిపోయెను.
ఆదికాండము 27:36
ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది; అతడు నన్ను ఈ రెండు మారులు మోస పుచ్చెను. నా జ్యేష్ఠత్వము తీసికొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసికొనెనని చెప్పినాకొరకు మరి యే దీవెనయు మిగిల్చి యుంచలేదా అని అడిగెను.
ఆదికాండము 27:37
అందుకు ఇస్సాకు ఇదిగో అతని నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరిని అతనికి దాసులుగా ఇచ్చితిని; ధాన్యమును ద్రాక్షారస మును ఇచ్చి అతని పోషించితిని గనుక నా కుమారుడా, నీకేమి చేయగలనని ఏసావుతో ప్రత్యుత్తర మియ్యగా
ఆదికాండము 27:38
ఏశావు నా తండ్రీ, నీయొద్ద ఒక దీవెనయే ఉన్నదా? నా తండ్రీ, నన్ను, నన్ను కూడ దీవించుమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి యేడ్వగా అతని తండ్రియైన ఇస్సాకు
ఆదికాండము 27:39
నీ నివాసము భూసారము లేకయు పైనుండిపడు ఆకాశపు మంచు లేకయు నుండును.
ఆదికాండము 27:40
నీవు నీకత్తిచేత బ్రదుకుదువు నీ సహోదరునికి దాసుడవగుదువు నీవు తిరుగులాడు చుండగా నీ మెడమీదనుండి అతనికాడి విరిచివేయుదువు అని అతని కుత్తరమిచ్చెను.
ఆదికాండము 27:41
తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతనిమీద పగపట్టెను. మరియు ఏశావునా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా నున్నవి; అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను.
ఆదికాండము 27:42
రిబ్కా తన పెద్దకుమారుడైన ఏశావు మాటలనుగూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెనుఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపె దనని చెప్పి నిన్ను గూర్చి తన్నుతాను ఓదార్చుకొను చున్నాడు.
ఆదికాండము 27:43
కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్నకోపము చల్లారువరకు
ఆదికాండము 27:44
నీ అన్న కోపము నీమీదనుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచువరకు లాబానునొద్ద కొన్నాళ్లు ఉండుము;
ఆదికాండము 27:45
అప్పుడు నేను అక్కడనుండి నిన్ను పిలిపించె దను. ఒక్కనాడే మీ యిద్దరిని నేను పోగొట్టుకొన నేల అనెను.
ఆదికాండము 27:46
మరియు రిబ్కా ఇస్సాకుతోహేతు కుమార్తెలవలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రయిన హేతు కుమార్తెలలో వీరివంటి ఒకదానిని యాకోబు పెండ్లి చేసి కొనినయెడల నా బ్రదుకువలన నాకేమి ప్రయోజనమనెను.
ఆదికాండము 28:1
ఇస్సాకు యాకోబును పిలిపించినీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసికొనకూడదు.
ఆదికాండము 28:2
నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రియైన బెతూయేలు ఇంటికి వెళ్లి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసికొనుమని యతనికి ఆజ్ఞాపించి
ఆదికాండము 28:3
సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభి వృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశ మును, అనగా దేవుడు అబ్రాహామునకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసి కొనునట్లు
ఆదికాండము 28:4
ఆయన నీకు, అనగా నీకును నీతో కూడ నీ సంతానమునకును అబ్రాహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతని దీవించి
ఆదికాండము 28:5
యాకోబును పంపివేసెను. అతడు పద్దన రాములోనున్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును, యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్లెను.
ఆదికాండము 28:6
ఇస్సాకు యాకోబును దీవించి, పద్దనరాములో పెండ్లిచేసికొని వచ్చుటకై అతని నక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడునీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెండ్లి చేసికొనవద్దని అతనికి ఆజ్ఞాపించెననియు
ఆదికాండము 28:7
యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్లి పోయెననియు ఏశావు తెలిసికొని నప్పుడు,
ఆదికాండము 28:8
ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రియైన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసి నప్పుడు
ఆదికాండము 28:9
ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్లి, తనకున్న భార్యలుగాక అబ్రాహాము కుమారుడైన ఇష్మాయేలు కుమా ర్తెయు నెబాయోతు సహోదరియునైన మహలతును కూడ పెండ్లి చేసికొనెను.
ఆదికాండము 28:10
యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారాను వైపు వెళ్లుచు
ఆదికాండము 28:11
ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండు కొనెను.
ఆదికాండము 28:12
అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమిమీద నిలుపబడియుండెను; దాని కొన ఆకాశమునంటెను; దానిమీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచునుండిరి.
ఆదికాండము 28:13
మరియు యెహోవా దానికి పైగా నిలిచినేను నీ తండ్రియైన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను; నీవు పండుకొనియున్న యీ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను.
ఆదికాండము 28:14
నీ సంతానము భూమిమీద లెక్కకు ఇసుక రేణువులవలెనగును; నీవు పడమటి తట్టును తూర్పుతట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించెదవు, భూమియొక్క వంశములన్నియు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును.
ఆదికాండము 28:15
ఇదిగో నేను నీకు తోడై యుండి, నీవు వెళ్లు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరల రప్పించెదను; నేను నీతో చెప్పినది నెరవేర్చువరకు నిన్ను విడువనని చెప్పగా
ఆదికాండము 28:16
యాకోబు నిద్ర తెలిసినిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు; అది నాకు తెలియక పోయెననుకొని
ఆదికాండము 28:17
భయపడిఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే గాని వేరొకటికాదు;
ఆదికాండము 28:18
పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసికొనిన రాయితీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొనమీద నూనె పోసెను.
ఆదికాండము 28:19
మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు.
ఆదికాండము 28:20
అప్పుడు యాకోబునేను తిరిగి నా తండ్రి యింటికి క్షేమముగా వచ్చునట్లు దేవుడు నాకు తోడైయుండి, నేను వెళ్లుచున్న యీ మార్గములో నన్ను కాపాడి,
ఆదికాండము 28:21
తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు దేవుడై యుండును.
ఆదికాండము 28:22
మరియు స్తంభముగా నేను నిలిపిన యీ రాయి దేవుని మందిరమగును; మరియు నీవు నా కిచ్చు యావత్తులో పదియవవంతు నిశ్చయముగా నీకు చెల్లించెదనని మ్రొక్కు కొనెను.
ఆదికాండము 29:1
యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్లెను.
ఆదికాండము 29:2
అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దానియొద్ద గొఱ్ఱెల మందలు మూడు పండుకొని యుండెను; కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు; ఒక పెద్ద రాయి ఆ బావిమీద మూతవేసి యుండెను.
ఆదికాండము 29:3
అక్కడికి మందలన్నియు కూడి వచ్చు నప్పుడు బావిమీదనుండి ఆ రాతిని పొర్లించి, గొఱ్ఱెలకు నీళ్లు పెట్టి తిరిగి బావిమీది రాతిని దాని చోటనుంచు దురు.
ఆదికాండము 29:4
యాకోబు వారిని చూచి అన్నలారా, మీ రెక్కడివారని అడుగగా వారుమేము హారానువార మనిరి.
ఆదికాండము 29:5
అతడునాహోరు కుమారుడగు లాబానును మీ రెరుగుదురా అని వారినడుగగా వారు ఎరుగుదుమనిరి.
ఆదికాండము 29:6
మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారుక్షేమముగానే ఉన్నాడు; ఇదిగో అతని కుమార్తెయైన రాహేలు గొఱ్ఱెలవెంట వచ్చుచున్నదని చెప్పిరి.
ఆదికాండము 29:7
అతడు ఇదిగో ఇంక చాలా ప్రొద్దు ఉన్నది, పశువు లను పోగుచేయు వేళకాలేదు, గొఱ్ఱెలకు నీళ్లు పెట్టి, పోయి వాటిని మేపుడని చెప్పగా
ఆదికాండము 29:8
వారుమంద లన్నియు పోగుకాకమునుపు అది మావలన కాదు, తరువాత బావిమీదనుండి రాయి పొర్లించుదురు; అప్పుడే మేము గొఱ్ఱెలకు నీళ్లు పెట్టుదుమనిరి.
ఆదికాండము 29:9
అతడు వారితో ఇంక మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొఱ్ఱెల మందను తోలుకొని వచ్చెను; ఆమె వాటిని మేపునది.
ఆదికాండము 29:10
యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును, తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలను చూచినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావిమీదనుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాబాను గొఱ్ఱెలకు నీళ్లు పెట్టెను. యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని యెలుగెత్తి యేడ్చెను.
ఆదికాండము 29:11
మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు,
ఆదికాండము 29:12
రిబ్కా కుమారుడనియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను.
ఆదికాండము 29:13
లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతనిని ఎదు ర్కొనుటకు పరుగెత్తికొని వచ్చి అతని కౌగలించి ముద్దు పెట్టుకొని తన యింటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నియు లాబానుతో చెప్పెను.
ఆదికాండము 29:14
అప్పుడు లాబానునిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై యున్నావు అనెను. అతడు నెల దినములు అతనియొద్ద నివసించిన తరువాత
ఆదికాండము 29:15
లాబానునీవు నా బంధువుడవైనం దున ఊరకయే నాకు కొలువు చేసెదవా? నీకేమి జీతము కావలెనో చెప్పుమని యాకోబు నడిగెను.
ఆదికాండము 29:16
లాబాను కిద్దరు కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా; చిన్నదాని పేరు రాహేలు.
ఆదికాండము 29:17
లేయా జబ్బు కండ్లు గలది; రాహేలు రూపవతియు సుందరియునై యుండెను.
ఆదికాండము 29:18
యాకోబు రాహేలును ప్రేమించినీ చిన్న కుమార్తెయైన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసెదననెను.
ఆదికాండము 29:19
అందుకు లాబానుఆమెను అన్యునికిచ్చుటకంటె నీకిచ్చుట మేలు; నాయొద్ద ఉండుమని చెప్పగా
ఆదికాండము 29:20
యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించుటవలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను.
ఆదికాండము 29:21
తరువాత యాకోబునా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్యయొద్దకు పోవునట్లు ఆమెను నాకిమ్మని లాబాను నడుగగా
ఆదికాండము 29:22
లాబాను ఆ స్థలములోనున్న మనుష్యుల నందరిని పోగుచేసి విందు చేయించి
ఆదికాండము 29:23
రాత్రి వేళ తన కుమార్తెయైన లేయాను అతనియొద్దకు తీసికొని పోగా యాకోబు ఆమెను కూడెను.
ఆదికాండము 29:24
మరియు లాబాను తన దాసియైన జిల్పాను తన కుమార్తెయైన లేయాకు దాసిగా ఇచ్చెను.
ఆదికాండము 29:25
ఉదయమందు ఆమెను లేయా అని యెరిగి అతడు లాబానుతో నీవు నాకు చేసిన పని యేమిటి? రాహేలు కోసమేగదా నీకు కొలువు చేసితిని? ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను.
ఆదికాండము 29:26
అందుకు లాబానుపెద్ద దానికంటె ముందుగా చిన్న దాని నిచ్చుట మాదేశ మర్యాదకాదు.
ఆదికాండము 29:27
ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము; నీవిక యేడు సంవత్సరములు నాకు కొలువు చేసినయెడల అందుకై ఆమెను కూడ నీకిచ్చెదమని చెప్పగా
ఆదికాండము 29:28
యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తియైన తరు వాత అతడు తన కుమార్తెయైన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను.
ఆదికాండము 29:29
మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తెయైన రాహేలుకు దాసిగా ఇచ్చెను.
ఆదికాండము 29:30
యాకోబు రాహేలును కూడెను, మరియు అతడు లేయాకంటె రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరియేడేండ్లు కొలువు చేసెను.
ఆదికాండము 29:31
లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై యుండెను.
ఆదికాండము 29:32
లేయా గర్భవతియై కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచియు న్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును గదా అనుకొని అతనికి రూబేను అను పేరు పెట్టెను.
ఆదికాండము 29:33
ఆమె మరల గర్భవతియై కుమారుని కనినేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతనికూడ నాకు దయచేసె ననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను.
ఆదికాండము 29:34
ఆమె మరల గర్భవతియై కుమారుని కనితుదకు ఈ సారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును; అతనికి ముగ్గురు కుమారులను కంటినను కొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను
ఆదికాండము 29:35
ఆమె మరల గర్భవతియై కుమారుని కనిఈ సారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడామెకు కానుపు ఉడిగెను.

Leave a Reply