యేసుతో ప్రతి ఉదయము-DAY 5
🌅 YESUTHO PRATHI UDHAYAM – DAY 5
యేసుతో ప్రతి ఉదయము:-
“దేవుడు నీ కన్నీళ్లను లెక్కలో ఉంచుతున్నాడు”
📖 ప్రధాన వాక్యం :-
ఈ రోజు దేవుని వాగ్దానము:-
కీర్తనలు 56:8
నా సంచారములను నీవు లెక్కించి యున్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి యున్నవి అవి నీ కవిలెలో కనబడును గదా.
“నా కన్నీళ్లను నీ సీసాలో భద్రపరచుము;
అవి నీ గ్రంథంలో లేవా?”
చిన్న కథ:-
ఒక చిన్న బాలిక రాత్రి ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది.
ఎవరికీ చెప్పలేని బాధ.
ఎవరూ వినని ప్రార్థన.
ఆమె తల్లి వచ్చి అడిగింది:
“ఎందుకు ఏడుస్తున్నావు?”
బాలిక చెప్పింది:
“ఎవరూ చూడట్లేదనుకున్నాను… కానీ దేవుడు చూస్తాడని గుర్తొచ్చింది.”
👉 మనం మరిచిపోయినా
👉 దేవుడు మన కన్నీళ్లను మరిచిపోడు.
1️⃣ కన్నీళ్లు = బలహీనత కాదు
ప్రపంచం చెబుతుంది:
“ఏడవద్దు… బలంగా ఉండు.”
కానీ దేవుడు చెబుతున్నాడు:
👉 ఏడుపులో కూడా నేను నీతోనే ఉన్నాను.
యేసు కూడా ఏడ్చాడు (యోహాను 11:35).
అంటే కన్నీళ్లు పాపం కాదు — అవి ప్రార్థనలే.
2️⃣ దేవుడు గమనించని కన్నీళ్లు లేవు
కీర్తనకర్త దావీదు చెబుతున్నాడు:
“నా కన్నీళ్లు నీ సీసాలో ఉన్నాయి.”
అర్థం ఏమిటి?
ఒక్క కన్నీరు కూడా వృథా కాదు
ఒక్క బాధ కూడా లెక్క తప్పదు
🌟 గొప్ప పలుకులు (Motivational Quotes)
“ప్రపంచం నీ కన్నీళ్లను తుడిచేయమంటుంది,
దేవుడు వాటిని గుర్తుంచుకుంటాడు.”
“నీవు ఏడుస్తున్నప్పుడు
దేవుడు పని చేస్తున్నాడు.”
3️⃣ మన జీవితానికి అన్వయము
ఈ రోజు నీవు:
నిశ్శబ్దంగా ఏడుస్తున్నావా?
లోపలే బాధ దాచుకుంటున్నావా?
ప్రార్థన కూడా కన్నీళ్లుగా మారిందా?
👉 ఆ కన్నీళ్లే
👉 రేపటి ఆనందానికి విత్తనాలు.
4️⃣ ఆశ వాక్యం
బైబిల్ వాగ్దానం చెబుతుంది:
“ఏడుపు సాయంకాలము వరకు ఉండును,
ఉదయమున ఆనందము వచ్చును.”
— కీర్తనలు 30:5
🙏 ప్రార్థన
“ప్రభూ,
నా కన్నీళ్లను నీవు చూస్తున్నావని
ఈ రోజు నన్ను ధైర్యపరచుము.
నా బాధను ఆశగా మార్చుము.యేసు నామములో ప్రార్ధిస్తున్నాము … తండ్రి
ఆమెన్.”
ONE YEAR BIBLE READING PLAN:-
ఆదికాండము 16-18 అధ్యాయములు
ఆదికాండము 16:1
అబ్రాము భార్యయైన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తీయురాలైన దాసి యుండెను.
ఆదికాండము 16:2
కాగా శారయిఇదిగో నేను పిల్లలు కనకుండ యెహోవా చేసి యున్నాడు. నీవు దయచేసి నా దాసితో పొమ్ము; ఒకవేళ ఆమెవలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను; అబ్రాము శారయి మాట వినెను.
ఆదికాండము 16:3
కాబట్టి అబ్రాము కనాను దేశములో పదియేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్యయైన శారయి తన దాసియైన హాగరను ఐగుప్తీయు రాలిని తీసికొని తన పెనిమిటియైన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికిచ్చెను.
ఆదికాండము 16:4
అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయెను. అది తాను గర్భవతి నైతినని తెలిసికొనినప్పుడు దాని యజమానురాలు దానిదృష్టికి నీచమైనదాయెను.
ఆదికాండము 16:5
అప్పుడు శారయినా ఉసురు నీకు తగులును; నేనే నా దాసిని నీ కౌగిటి కిచ్చిన తరువాత తాను గర్భవతినైతినని తెలిసికొనినప్పుడు నేను దానిదృష్టికి నీచమైనదాననైతిని; నాకును నీకును యెహోవ న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అనెను.
ఆదికాండము 16:6
అందుకు అబ్రాముఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది; నీ మనస్సు వచ్చినట్లు దాని చేయుమని శారయితో చెప్పెను. శారయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్దనుండి అది పారిపోగా
ఆదికాండము 16:7
యెహోవా దూత అరణ్య ములో నీటిబుగ్గయొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద, ఆమెను కనుగొని
ఆదికాండము 16:8
శారయి దాసివైన హాగరూ, ఎక్కడనుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగి నందుకు అదినా యజమానురాలైన శారయియొద్దనుండి పారిపోవుచున్నాననెను.
ఆదికాండము 16:9
అప్పుడు యెహోవా దూతనీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను.
ఆదికాండము 16:10
మరియు యెహోవా దూతనీ సంతానమును నిశ్చయముగా విస్త రింపజేసెదను; అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవునని దానితో చెప్పెను.
ఆదికాండము 16:11
మరియు యెహోవా దూతఇదిగో యెహోవా నీ మొరను వినెను. నీవు గర్భవతివై యున్నావు; నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు;
ఆదికాండము 16:12
అతడు అడవిగాడిదవంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని అందరి చేతులు అతనికిని విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి యెదుట నివసించునని దానితో చెప్పగా
ఆదికాండము 16:13
అదిచూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను ఏలయనగా నన్ను చూచినవాని నేనిక్కడ చూచితిని గదా అని అనుకొనెను.
ఆదికాండము 16:14
అందుచేత ఆ నీటిబుగ్గకు బెయేర్ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.
ఆదికాండము 16:15
తరువాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరు కనిన తన కుమారునికి ఇష్మా యేలను పేరు పెట్టెను.
ఆదికాండము 16:16
హాగరు అబ్రామునకు ఇష్మా యేలును కనినప్పుడు అబ్రాము ఎనుబదియారు ఏండ్ల వాడు.
ఆదికాండము 17:1
అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమైనేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.
ఆదికాండము 17:2
నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెద నని అతనితో చెప్పెను.
ఆదికాండము 17:3
అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను;
ఆదికాండము 17:4
నీవు అనేక జనములకు తండ్రివగుదువు.
ఆదికాండము 17:5
మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అన బడును.
ఆదికాండము 17:6
నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చునట్లు నియమించుదును, రాజు లును నీలోనుండి వచ్చెదరు.
ఆదికాండము 17:7
నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు, నాకును నీకును, నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్యనిబంధనగా స్థిరపరచెదను.
ఆదికాండము 17:8
నీకును నీతరు వాత నీ సంతతికిని నీవు పరదేశివైయున్న దేశమును, అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనై యుందునని అతనితో చెప్పెను.
ఆదికాండము 17:9
మరియు దేవుడునీవును, నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొన వలెను.
ఆదికాండము 17:10
నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన యేదనగామీలో ప్రతి మగవాడును సున్నతి పొంద వలెను.
ఆదికాండము 17:11
మీరు మీ గోప్యాంగచర్మమున సున్నతి పొందవలెను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును.
ఆదికాండము 17:12
ఎనిమిది దినముల వయస్సుగలవాడు, అనగా నీ యింట పుట్టినవాడైనను, నీ సంతానము కాని అన్యునియొద్ద వెండితో కొనబడినవాడైనను, మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను.
ఆదికాండము 17:13
నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును, తప్పక సున్నతి పొందవలెను. అప్పుడు నా నిబంధన మీ శరీర మందు నిత్య నిబంధనగా ఉండును.
ఆదికాండము 17:14
సున్నతి పొందని మగవాడు, అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టి వేయ బడును. వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను.
ఆదికాండము 17:15
మరియు దేవుడునీ భార్యయైన శారయి పేరు శారయి అనవద్దు; ఏలయనగా ఆమె పేరు శారా
ఆదికాండము 17:16
నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను; నేనామెను ఆశీర్వదించెదను; ఆమె జనములకు తల్లియై యుండును; జనముల రాజులు ఆమెవలన కలు గుదురని అబ్రాహాముతో చెప్పెను.
ఆదికాండము 17:17
అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వినూరేండ్ల వానికి సంతానము కలుగునా? తొంబదియేండ్ల శారా కనునా? అని మనస్సులో అను కొనెను.
ఆదికాండము 17:18
అబ్రాహాముఇష్మాయేలు నీ సన్నిధిని బ్రదుక ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా
ఆదికాండము 17:19
దేవుడునీ భార్యయైన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును; నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు; అతని తరువాత అతని సంతానముకొరకు నిత్యనిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపర చెదను.
ఆదికాండము 17:20
ఇష్మాయేలునుగూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధిక ముగా అతని విస్తరింపజేసెదను; అతడు పండ్రెండు మంది రాజులను కనును; అతనిని గొప్ప జనముగా చేసెదను;
ఆదికాండము 17:21
అయితే వచ్చు సంవత్సరము ఈ కాల మందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.
ఆదికాండము 17:22
దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్లెను.
ఆదికాండము 17:23
అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును, తన యింట పుట్టిన వారినందరిని, తన వెండితో కొనబడిన వారినందరిని, అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకొని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను.
ఆదికాండము 17:24
అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంబది తొమ్మిది యేండ్లవాడు.
ఆదికాండము 17:25
అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగచర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదుమూడేండ్లవాడు.
ఆదికాండము 17:26
ఒక్కదినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయేలును సున్నతి పొందిరి.
ఆదికాండము 17:27
అతని యింట పుట్టినవారును అన్యునియొద్ద వెండితో కొనబడినవారును అతని యింటిలోని పురుషు లందరును అతనితో కూడ సున్నతి పొందిరి.
ఆదికాండము 18:1
మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని యున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.
ఆదికాండము 18:2
అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుష్యులు అతని యెదుట నిలువబడి యుండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటనుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి, నేలమట్టుకు వంగి
ఆదికాండము 18:3
ప్రభువా, నీ కటాక్షము నామీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటి పోవద్దు.
ఆదికాండము 18:4
నేను కొంచెము నీళ్లు తెప్పించెదను; దయచేసి కాళ్లు కడుగు కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి.
ఆదికాండము 18:5
కొంచెము ఆహారము తెచ్చెదను; మీ ప్రాణములను బలపరచు కొనుడి; తరువాత మీరు వెళ్లవచ్చును; ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారునీవు చెప్పి నట్లు చేయుమనగా
ఆదికాండము 18:6
అబ్రాహాము గుడారములో నున్న శారాయొద్దకు త్వరగా వెళ్లినీవు త్వరపడి మూడు మానికల మెత్తనిపిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయుమని చెప్పెను.
ఆదికాండము 18:7
మరియు అబ్రాహాము పశువుల మందకు పరుగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివాని కప్ప గించెను. వాడు దాని త్వరగా సిద్ధపరచెను.
ఆదికాండము 18:8
తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారియెదుట పెట్టి వారు భోజనము చేయు చుండగా వారియొద్ద ఆ చెట్టుక్రింద నిలుచుండెను.
ఆదికాండము 18:9
వారతనితో నీ భార్యయైన శారా ఎక్కడ నున్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను.
ఆదికాండము 18:10
అందుకాయనమీదటికి ఈ కాలమున నీయొద్దకు నిశ్చ యముగా మరల వచ్చెదను. అప్పడు నీ భార్యయైన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను.
ఆదికాండము 18:11
అబ్రాహామును శారాయును బహుకాలము గడచిన వృద్ధులై యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచి పోయెను గనుక
ఆదికాండము 18:12
శారానేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమాను డును వృద్ధుడై యున్నాడు గదా అని తనలో నవ్వుకొనెను.
ఆదికాండము 18:13
అంతట యెహోవా అబ్రాహాముతోవృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేల?
ఆదికాండము 18:14
యెహోవాకు అసాధ్యమైనది ఏదైన నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగుననెను.
ఆదికాండము 18:15
శారా భయపడినేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివనెను.
ఆదికాండము 18:16
అప్పుడా మనుష్యులు అక్కడనుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రాహాము వారిని సాగనంపుటకు వారితోకూడ వెళ్లెను.
ఆదికాండము 18:17
అప్పుడు యెహోవానేను చేయబోవు కార్యము అబ్రాహామునకు దాచెదనా?
ఆదికాండము 18:18
అబ్రాహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును.
ఆదికాండము 18:19
ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.
ఆదికాండము 18:20
మరియు యెహోవాసొదొమ గొమొఱ్ఱాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను
ఆదికాండము 18:21
నేను దిగిపోయి నాయొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను; చేయనియెడల నేను తెలిసికొందుననెను.
ఆదికాండము 18:22
ఆ మనుష్యులు అక్కడనుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్లిరి. అబ్రాహాము ఇంక యెహోవా సన్నిధిని నిలుచుండెను.
ఆదికాండము 18:23
అప్పడు అబ్రాహాము సమీపించి యిట్లనెనుదుష్టులతోకూడ నీతి మంతులను నాశనము చేయుదువా?
ఆదికాండము 18:24
ఆ పట్టణములో ఒకవేళ ఏబదిమంది నీతిమంతులుండినయెడల దానిలోనున్న యేబదిమంది నీతి మంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా?
ఆదికాండము 18:25
ఆ చొప్పున చేసి దుష్టులతో కూడ నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టు నితో సమముగా ఎంచుట నీకు దూరమవు గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు
ఆదికాండము 18:26
యెహోవాసొదొమ పట్టణములో ఏబదిమంది నీతిమంతులు నాకు కనబడినయెడల వారినిబట్టి ఆ స్థలమంతటిని కాయుదుననెను
ఆదికాండము 18:27
అందుకు అబ్రాహాముఇదిగో ధూళియు బూడిదెయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను.
ఆదికాండము 18:28
ఏబదిమంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువై నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ నలుబది యైదు గురు నాకు కనబడినయెడల నాశనము చేయననెను;
ఆదికాండము 18:29
అతడింక ఆయనతో మాటలాడుచుఒకవేళ అక్కడ నలుబదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయనఆ నలుబదిమందిని బట్టి నాశనముచేయక యుందునని చెప్పగా
ఆదికాండము 18:30
అతడు ప్రభువు కోపపడనియెడల నేను మాటలాడెదను; ఒకవేళ అక్కడ ముప్పదిమందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ ముప్పదిమంది నాకు కనబడినయెడల నాశనము చేయననెను.
ఆదికాండము 18:31
అందు కతడుఇదిగో ప్రభువుతో మాటలాడ తెగించితిని; ఒకవేళ అక్కడ ఇరువదిమంది కనబడుదురేమో అని నప్పుడు ఆయన ఆ యిరువదిమందినిబట్టి నాశనము చేయ కుందుననగా
ఆదికాండము 18:32
అతడు ప్రభువు కోపపడనియెడల నే నింకొకమారే మాటలాడెదను; ఒకవేళ అక్కడ పదిమంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ పదిమందినిబట్టి నాశనము చేయక యుందుననెను.
ఆదికాండము 18:33
యెహోవా అబ్రాహాముతో మాటలాడుట చాలించి వెళ్లిపోయెను. అబ్రాహాము తన యింటికి తిరిగి వెళ్లెను.
