G-DYR27RHXFV dir="ltr" itemscope="itemscope" itemtype="http://schema.org/WebPage">
PRAYERS TO THE WORLD

POWER OF PRAYER

Archives

  • February 2026
  • January 2026
  • December 2025

Categories

  • Blog
  • BLOG
  • యేసుతో ప్రతి ఉదయము
  • HOME
  • ABOUT US
  • CONTACT US
  • PRAYER REQUEST
  • SERVICES
    • యేసుతో ప్రతి ఉదయము
    • యేసుతో ప్రతి ఉదయము-DAY9
    • యేసుతో ప్రతి ఉదయము- DAY 8
    • యేసుతో ప్రతి ఉదయము- DAY 7
    • యేసుతోప్రతి ఉదయము-DAY 6
    • యేసుతో ప్రతి ఉదయము-DAY 5
    • యేసుతో ప్రతి ఉదయం-DAY -4
    • యేసుతో ప్రతి ఉదయం-DAY 3
    • యేసుతో ప్రతి ఉదయం- DAY 2
    • యేసుతో ప్రతి ఉదయం – DAY 1
    • మిషనరీ బయోగ్రఫీ
      • డేవిడ్ లివింగ్ స్టన్ (1813 – 1873)
        • ప్రాణాలకే తెగించించిన సేవకుడు
  • TERMS & CONDITIONS
  • PRIVACY POLICY

Author: banturajeshwari67

యేసుతోప్రతిఉదయము-DAY 33 దేవుని కన్ను మీపై ఉంది

February 9, 2026 by banturajeshwari67 Leave a Comment

యేసుతోప్రతిఉదయము:-

ఈరోజు దేవుని వాగ్దానము:-

నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తన 32:8

దేవుని కన్ను మీపై ఉంది

ఈ వాక్యం ఇచ్చే ధైర్యం మరియు అర్థం నిజంగా అద్భుతం:

  • దేవుని నిరంతరం చూస్తున్నాడు: లోకమంతటా ఆయన దృష్టి సంచరిస్తోంది అంటే, మనం చేసే ప్రతి పని, మన పడే ప్రతి కష్టం ఆయనకు తెలుసు అని అర్థం. మనం ఒంటరిగా ఉన్నామని అనుకున్నా, ఆయన మనల్ని గమనిస్తూనే ఉంటారు.
  • యదార్థ హృదయం: దేవుడు మన పైరూపాన్ని లేదా మన ఆస్థి పాస్తులను చూడడు; ఆయన చూసేది మన హృదయాన్ని. ఎవరైతే నిష్కల్మషంగా, నిజాయితీగా ఉంటారో వారంటే ఆయనకు ఇష్టం.
  • బలపరచుట: ఆయన గమనించేది కేవలం తప్పులు పట్టడానికి కాదు, తనను నమ్ముకున్న వారికి తోడుగా ఉండి, వారిని బలపరచడానికి.

కష్టకాలంలో ఉన్నప్పుడు లేదా మనం చేసే మంచిని ఎవరూ గుర్తించడం లేదు అనిపించినప్పుడు ఈ వాక్యం మనకు గొప్ప ఓదార్పునిస్తుంది.

దేవుని కన్ను మీపై ఉంది

మనుషులు మన పైరూపాన్ని, మన విజయాన్ని చూస్తారు. కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తారు. ఈ లోకంలో కోట్లాది మంది ఉన్నప్పటికీ, ఎవరైతే ఆయన పట్ల యదార్థంగా (నిజాయితీగా) ఉంటారో వారిని వెతకడానికి ఆయన కనుదృష్టి లోకమంతటా సంచరిస్తోంది. బలహీనంగా ఉన్న మిమ్మల్ని బలపరచడానికి, ఒంటరిగా ఉన్న మీకు తోడుగా ఉండటానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీరు చేసే చిన్న ప్రార్థన, మీరు చూపే చిన్న నిజాయితీ ఆయన దృష్టిని ఆకర్షిస్తుంది.

చిన్నకథ:-

ప్రవక్త సమూయేలు మరియు దావీదు

దేవుడు ఇశ్రాయేలీయులకు రాజును ఎన్నుకోమని సమూయేలు ప్రవక్తను యెష్షై ఇంటికి పంపినప్పుడు, సమూయేలు యెష్షై పెద్ద కుమారుడైన ఏలీయాబును చూసి, “నిశ్చయముగా ఇతడే దేవుడు ఎంచుకున్న వ్యక్తి” అనుకున్నాడు. ఎందుకంటే అతను ఎత్తుగా, బలంగా ఉన్నాడు.

కానీ దేవుడు సమూయేలుతో ఇలా అన్నాడు: “మనుష్యులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును.” చివరికి, అడవిలో గొర్రెలు కాచుకుంటూ, ఎవరికీ తెలియకుండా తన పనిని నమ్మకంగా, యదార్థంగా చేస్తున్న దావీదును దేవుడు ఎంచుకున్నాడు. లోకం దావీదును మర్చిపోయినా, లోకమంతటా సంచరించే దేవుని దృష్టి ఆ యదార్థవంతుడైన చిన్నవాడిని కనిపెట్టి, రాజుగా బలపరిచింది.

గొప్ప పలుకులు

  • “మనుషులు చూడనప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారో, అదే మీ నిజమైన క్యారెక్టర్.”
  • “నీ నీతిని లోకానికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, నీ యదార్థతను దేవుడు చూస్తే చాలు.”
  • “దేవుని బలం మన బలహీనతలో పరిపూర్ణమౌతుంది, మనం ఆయనకు హృదయాన్ని అప్పగించినప్పుడు.”

ప్రార్థన:-

“ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ వాక్యం ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనాలు. నా హృదయం నీ యెడల ఎల్లప్పుడూ యదార్థంగా ఉండేలా కృప చూపండి. నేను ఒంటరి వాడిని/దాన్ని కాదని, నీ కనుదృష్టి నాపై ఉందని నమ్ముతున్నాను. నా బలహీనతల్లో నన్ను బలపరచి, నీ మహిమ కోసం నన్ను వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్.”

Posted in: యేసుతో ప్రతి ఉదయము, Blog Tagged: దేవుని కన్ను మీపై ఉంది

యేసుతో ప్రతి ఉదయము DAY 32/విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు

February 5, 2026 by banturajeshwari67 1 Comment

యేసుతో ప్రతి ఉదయము:-

ఈరోజు దేవుని వాగ్దానము:-

అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. యెషయా 45:3

“విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు”

మనకు సంపాదించడానికి ఆయన సిలువ మరణం పొందాడు. అలాంటి తండ్రి ఎప్పుడైనా నిన్ను విడిచిపెడతాడు?

తనతో పాటు మనకు అన్నిటిని ఉచితంగా ఎందుకు ఇవ్వడు ?

అవిశ్వాసి బాష =”ఎలా ఇస్తాడు “

విశ్వాసి బాష =”ఎందుకు ఇవ్వడు “

మీ జీవితాలలో దేవుని కార్యాలకు మొదటి స్థానం ఇస్తే మీ భవిష్యత్తులో అవసరమైన అవసరతలను అయన తీరుస్తాడు.మొదట ఆయన రాజ్యమును,నీతిని వెదికితే మీ జీవితావసరాలను కొరత లేకుండా చూసుకుంటాడు.

దేవుడు తన ప్రజల అవసరాన్ని తీర్చాడు.ఆయన ఐశ్వర్యం నుండి కాకుండా, యేసు క్రీస్తు  ద్వారా మహిమలో ఉన్న తన ఐశ్వర్యాన్ని బట్టి అనుగ్రహిస్తాడు.

  • ఈ సంవత్సరములో నాకు ఒక మంచి ఉద్యోగం దొరకదా?
  • నా జీతము పెరగదా?
  • ప్రమోషన్ రాదా?
  • యువతీ,యువకులు -నాకు సరిపడా వివాహ సంబంధము దొరకదా?
  • అనియు వివాహమైన వారు – నాకు సంతాన భాగ్యము కలుగదా?
  • అనియు ఆశతో ఎదురు చూడవచ్చు.

 మహోన్నతమైన దేవుని వద్ద నుండి మనము పొందుచున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము లోకానుసారమైన ధననిధి కంటె బహు 

చిన్నకథ:-

ఒక అడవిలో ఒక పక్షి తన గూడు కట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ అక్కడ విపరీతమైన గాలి వాన మొదలైంది. ఆ పక్షి భయపడకుండా ఒక పెద్ద చెట్టు కొమ్మ చాటున తలదాచుకుంది. వాన తగ్గాక చూస్తే, ఆ గాలికి ఒక పాత చెట్టు కూలిపోయింది. ఆ చెట్టు లోపల ఒక పెద్ద తేనెపట్టు, పండ్లు దాగి ఉన్నాయి. ఆ పక్షి కష్టపడకుండానే దానికి కావలసిన ఆహారం లభించింది.

నీతి: మన జీవితంలో చీకటి రోజులు (కష్టాలు) వచ్చినప్పుడు, దేవుడు మన కోసం “రహస్య స్థలాలలో ధనాన్ని” దాచి ఉంచుతాడు. మనం ఆయనపై నమ్మకం ఉంచితే, కష్టాల వెనుక ఉన్న దీవెనలను ఆయన బయలుపరుస్తాడు.

అనుదిన ఆత్మీయ పలకులు

  • విశ్వాసపు పలుకు: “ఎలా ఇస్తాడు?” అని అడగడం లోకం రీతి… “నా తండ్రి నాకు ఎందుకు ఇవ్వడు?” అని ధీమాగా ఉండటం విశ్వాసి నీతి!
  • సిలువ ప్రేమ: మన కోసం ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు, మనకు అవసరమైన లోక ధనాన్ని ఇవ్వకుండా దాచుకుంటాడా? ఆయన ప్రేమలో కొరత లేదు, నీ విశ్వాసంలో వెలితి ఉండకూడదు.
  • ధైర్యపు పలుకు: లోకం నిన్ను చీకటిలో నెట్టేయాలని చూస్తుందేమో, కానీ దేవుడు ఆ అంధకారంలోనే నీ కోసం ‘మరుగైన ధనాన్ని’ దాచి ఉంచాడు. ధైర్యంగా ఉండు!
  • జీవన సూత్రం: నీ అవసరాల వెనుక నువ్వు పరిగెత్తకు; దేవుని రాజ్యము వెనుక నువ్వు పరిగెత్తు, నీ అవసరాలే నీ వెనుక వస్తాయి.
  • ఆయన ఐశ్వర్యం: దేవుడు తన దగ్గర ఉన్న ‘కొంత’ ఇవ్వడు… తన మహిమలో ఉన్న ఐశ్వర్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు

“నేటి నుండి నా ప్రార్థన ‘అది కావాలి, ఇది కావాలి’ అని కాదు… ‘ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చే శక్తిని ఇవ్వు, నా అవసరాలు నీకు తెలుసు’ అని మారుద్దాం.”

 

ప్రార్థన: “ప్రభువా, సందేహించే మనసును తీసివేసి, ‘నీవు ఎందుకు ఇవ్వవు?’ అని అడిగే గొప్ప విశ్వాసాన్ని నాకు ప్రసాదించు. నీ రాజ్యానికి నా జీవితంలో మొదటి స్థానం ఇస్తాను.” యేసు  క్రీస్తు నామములో ప్రార్ధిస్తున్నాము తండ్రి,ఆమెన్ .

Posted in: యేసుతో ప్రతి ఉదయము, Blog Tagged: విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు

యేసుతో ప్రతి ఉదయము-DAY 31-ఎడారి జీవితంలో వసంతం

February 1, 2026 by banturajeshwari67 Leave a Comment

యేసుతో ప్రతి ఉదయము:-

ఈరోజు దేవుని వాగ్దానము:-

“అరణ్యమును, ఎండిన భూమియు సంతోషించును  కస్తూరి పుష్పము వలే పూయును పోయును. అది బహుగా పూయుచు ఉల్లసించును.ఉల్లసించి  సంగీతమును పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును. కర్మెలు షారోనులకున్న సోగసు  దాని కుండును. అవి  యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును.” యెషయా  35 :1, 2

“ఎడారి జీవితంలో వసంతం “

మన పాపము వల్ల ఏర్పడిన ఎడారి వంటి నిష్ఫలమైన జీవితాన్ని, దేవుడు తన కృపతో ఎలా ఒక అందమైన నందనవనంగా మార్చగలడో మనకు తెలియజేస్తుంది.

ప్రభువును తన సంతోషమును ఎంత సామాన్యముగను,ఎంత సౌందర్యముగను క్లుప్తపరచి యున్నాడో చూడుడి.  ఒక మనుష్యుని  అవిధేయత ద్వారా పాపము ఈ లోకంలో ప్రవేశించినప్పుడు అది శాపమును తీసుకొని వచ్చెను. 

ఆ శాపము వలన ముండ్లు, గచ్చపొదలు ,నిశ్ఫల స్థితి, నిరాశ స్థితి  ప్రతి చోట కనిపించుచున్నవి తన విద్యా పురోగమనము, సంస్కృతి మీద ఆధారపడి మానవుడు ఏమి చేయజూచినను. కేవలం ముళ్ళు,గచ్చపొదలు,ఎడారి ఇసుకగా మాత్రమే మిగిలిపోవును.

ప్రతి   గృహమునందు ముళ్ళు గచ్చు కథలు కలవు. 

ఏ మానవుని ద్వారా కూడా మార్చబడుటకు గాని, మెరుగుపరుచుటకు గాని వీలుకాని నిష్ఫలమైన ఎడారి గానే నీ జీవితము ఉన్నది. అయితే దేవుడేమీ చెప్పుచున్నాడో  చూడుము.  అడవి …. కస్తూరి పుష్పము వలె పూయుచు ఉల్లసించును,ఉల్లసించి సంగీతములు పాడును.” దేవుని కృప వలన కలుగు అద్భుతమిదియే. మన జీవితములలో గొడ్డుబారినవి గాను నిష్ఫలములుగాను అగుటకు కారణమైన పాపమును క్షమించుట  మాత్రమే గాక  ఆయన తన ప్రేమ ద్వారా నిశ్ఫల  జీవితమును ఎండిన  జీవితమును  కస్తూరి వనముగా చేయుటకు ఇష్టపడుతున్నాడు.

చిన్న కథ:-

బైబిల్లో సమరయ స్త్రీ జీవితాన్ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఆమె జీవితం పాపముతో నిండిన ఒక ఎడారి లాంటిది. సమాజంలో గౌరవం లేక, మనశ్శాంతి లేక మధ్యాహ్నం వేళ ఒంటరిగా నీటి కోసం వచ్చిన ఆమెకు ‘జీవజలమైన’ యేసుక్రీస్తు పరిచయమయ్యారు.

యేసు ఆమె పాపములను క్షమించి, ఆమె అంతరంగమును మార్చినప్పుడు, ఎండిపోయిన ఆమె జీవితం వెంటనే ఉల్లసించింది. ఎవరికైతే భయపడి దాక్కుందో, అదే ప్రజల వద్దకు వెళ్లి ఆమె ఒక గొప్ప సాక్షిగా మారింది. ఆమె హృదయం ఒక కస్తూరి పుష్పం వలె పూసి, ఆ ప్రాంతమంతా సువార్త పరిమళాన్ని వెదజల్లింది. మన జీవితం ఎంత ఎండిపోయినా, ఆయన తాకితే చాలు అది ఫలభరితంగా మారుతుంది.

గొప్ప పలుకులు

  • “మానవ ప్రయత్నం ఎడారి ఇసుకను మాత్రమే మిగిల్చగలదు, కానీ దేవుని కృప ఆ ఇసుకలోనూ పూదోటను నిర్మించగలదు.”
  • “నీ జీవితంలో ముళ్లు, గచ్చపొదలు నీ పాపానికి గుర్తులు కావచ్చు; కానీ కస్తూరి పుష్పాలు దేవుని క్షమాపణకు చిహ్నాలు.”
  • “సంగీతం లేని ఎడారి లాంటి నీ బ్రతుకులో, దేవుడు స్తుతి గీతాన్ని నింపబోతున్నాడు.”

ప్రార్ధన:-

పరిశుద్ధుడవైన మా తండ్రీ, ఈ ఉదయకాలము నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ప్రభువా, మా అవిధేయత వల్ల, పాపం వల్ల మా జీవితాలలో ఏర్పడిన ఎడారి పరిస్థితులను నీవు చూస్తున్నావు. మా గృహాలలో ఉన్న ముళ్ళను, గచ్చపొదలను తొలగించుము. నీ కృపతో మా ఎండిన జీవితాలను కస్తూరి వనముగా మార్చుము. మా హృదయాలలో రక్షణ ఆనందాన్ని, కొత్త సంగీతాన్ని నింపుము. నీ మహిమను మా జీవితాల్లో చూచునట్లు మమ్ములను దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రీ. ఆమేన్.

ONE YEAR BIBLE READING:

నిర్గమకాండము 39-40 అధ్యాయములు

Posted in: యేసుతో ప్రతి ఉదయము, Blog Tagged: ఎడారి జీవితంలో వసంతం

యేసుతో ప్రతి ఉదయము-DAY 30-విశ్వాసి ఆయుధం: క్రీస్తు నామము

January 31, 2026 by banturajeshwari67 Leave a Comment

యేసుతో ప్రతి ఉదయము:-

ఈరోజు దేవుని వాగ్దానము:-

“మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి,మీకు దొరకును” యోహాను 16:24

“విశ్వాసి ఆయుధం: క్రీస్తు నామము” (The Believer’s Weapon: The Name of Christ)

ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్ధించుట అనగానేమో నేర్చుకొనుము. “పరలోకమందును భూమిమీదను…సర్వాధికారము”ఆయనదై యున్నది. మత్తయి 28:18

దైవ మర్మము దీనిలో గలదు. ఆ శక్తి ఆ అధికారము ఈ భూమి మీద మన ద్వారానే ప్రయోగింపబడవలెను.ప్రభువైన యేసుక్రీస్తు నామమునందే మన బలము గలదు.

మనకు కష్టములు సంభవించినప్పుడు,శత్రువు రేగినప్పుడు మనమేమి చేయవలెను? అట్టి సమయములో మన బలము దాగిన స్థలమేది?నిశ్చయముగా అది మన మాటలలో లేదు. కాని యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమును ప్రయోగించుటలో యున్నది.

శత్రువు ప్రవాహ జలములవలె రానిమ్ము – యెషయా 59:19. 

గర్జించు సింహమువలె రానిమ్ము 1 పేతురు 5:8

ప్రభువైన యేసుక్రీస్తు నామమున వానిని మనము బంధించగలము. అదే మన ఆనందము,మన బలము.

క్రీస్తు నందు మనము అత్యధిక విజయశాలురము.

చిన్న కధ:- “అధికార పత్రం”

ఒక పట్టణంలో ఒక సామాన్యుడు ఉండేవాడు. అతనికి ఒక పెద్ద ఆపద వచ్చింది, ఆ సమస్య తీరాలంటే దేశాధినేత సంతకం లేదా అనుమతి తప్పనిసరి. కానీ సామాన్యుడైన అతనికి అంత పెద్ద వారిని కలిసే అవకాశం లేదు. అప్పుడు ఆ దేశపు మంత్రి, ఆ వ్యక్తి యొక్క యథార్థతను చూసి జాలిపడి, తన అధికారిక ముద్ర ఉన్న ఒక పత్రాన్ని (Letter of Authority) ఇచ్చి ఇలా అన్నాడు: “నువ్వు వెళ్ళినప్పుడు నీ ముఖం చూడరు, నీ హోదా అడగరు. కానీ ఈ పత్రం మీద ఉన్న నా పేరును చూసి నీకు కావలసినవన్నీ చేస్తారు.”

అతడు ఆ పత్రాన్ని పట్టుకుని వెళ్ళినప్పుడు, అక్కడి అధికారులు అతడిని ఎంతో గౌరవంతో ఆహ్వానించి, అతనికి కావలసిన సహాయాన్ని వెంటనే అందించారు. అతనికి ఉన్న సొంత శక్తి వల్ల అది జరగలేదు, కానీ అతని చేతిలో ఉన్న ఆ ‘నామము’ (పేరు) మరియు ఆ ‘ముద్ర’ అతనికి విజయాన్ని ఇచ్చాయి.

సందేశం: మన జీవితంలో కూడా సాతాను అనే శత్రువు మనల్ని అడ్డగించినప్పుడు లేదా సమస్యలు ఎదురైనప్పుడు, మన సొంత భక్తి లేదా తెలివితేటలు పని చేయకపోవచ్చు. కానీ “యేసు నామమున” అని మనం ప్రార్థించినప్పుడు, పరలోకపు సర్వాధికారము మన పక్షాన నిలబడుతుంది. ఆ నామమును ఉపయోగించడం అంటే దేవుని అధికారమును భూమి మీద ప్రయోగించడమే.

“యేసు నామము కేవలం ఒక పేరు కాదు, అది విశ్వాసికి ఇవ్వబడిన ఒక శక్తివంతమైన ఆయుధం.”

గొప్ప పలుకులు 

  • “ప్రార్థన అంటే దేవుని శక్తిని మన జీవితాల్లోకి ఆహ్వానించే తాళపు చెవి.”
  • “నీ సమస్య ఎంత పెద్దదైనా సరే, నీ దేవుని నామము అంతకంటే శక్తివంతమైనది.”
  • “యేసు నామము ఉచ్చరించినప్పుడు నరకపు శక్తులు కూడా గజగజ వణుకుతాయి.”

ప్రార్థన 

ప్రేమగల పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీరు మాకిచ్చిన ఈ అద్భుతమైన వాగ్దానమును బట్టి వందనాలు. ప్రభువా, యేసుక్రీస్తు నామమున ఉన్న శక్తిని మేము గుర్తించేలా చేయండి. మా కష్టాల్లో, శత్రువుల దాడిలో భయపడకుండా, మీ నామమును ప్రయోగించి విజయం పొందే కృపను మాకు దయచేయండి. మా సంతోషము పరిపూర్ణమగునట్లు మేము అడిగే ప్రతి విన్నపమును మీ చిత్తానుసారంగా నెరవేర్చమని, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్!

ONE YEAR BIBLE READING PLAN:-

నిర్గమకాండము 36-38 అధ్యాయములు

Posted in: యేసుతో ప్రతి ఉదయము, Blog Tagged: విశ్వాసి ఆయుధం: క్రీస్తు నామము

యేసు ప్రతి ఉదయము-DAY 29-“నూతన బలము – ఆత్మీయ పునరుజ్జీవనం”

January 30, 2026 by banturajeshwari67 Leave a Comment

యేసు ప్రతి ఉదయము:-

ఈ రోజు దేవుని వాగ్దానము:-

“పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయము తృప్తి పరచుచున్నాను.”కీర్తనలు 103:5

“నూతన బలము – ఆత్మీయ పునరుజ్జీవనం”

  • ఆత్మీయ జీవితమందు మనకు ఫై నుండి వచ్చు శక్తి కావలెను.
  • శత్రువు క్రియలను లయపరచుటకు పరిశుద్దాత్మ శక్తి కావలెను.
  • అపవాది తెచ్చు సమస్యలు,
  • పోరాటములను జయించుటకు,
  • జయము పొందిన పరిశుద్దులవలె సాగుటకును 
  • బలము అవసరము.

పోట్లాడుచున్న ఇద్దరిలో ఎవరు గెలిచెదరని మనము చెప్పగలము.

బలముగా ఉన్నవారే, బలము లేనివారిని పడద్రోయుదురు గదా ! అలాగైతే అంధకార శక్తులతో పోరాడుచున్న మనకు ఎంతో ఆత్మీయ బలము అవసరము.

చిన్న కధ:-

ఒక పక్షిరాజు వయస్సు 40 ఏళ్లకు వచ్చినప్పుడు, దాని రెక్కలు భారమైపోతాయి, ముక్కు వంకర తిరిగిపోతుంది, గోళ్లు మెత్తబడి ఎరను పట్టుకోలేవు. అప్పుడు అది రెండు దారులు ఎంచుకోవాలి: చావడం లేదా కష్టమైన మార్పును అంగీకరించడం.

అది ఒక ఎత్తైన కొండ మీదకు వెళ్లి, తన ముక్కును బండకు కొట్టి ఊడదీసేసుకుంటుంది. కొత్త ముక్కు వచ్చాక, తన పాత గోళ్లను పీకేస్తుంది. ఆ తర్వాత తన పాత రెక్కలను పీకేసి, ఐదు నెలల పాటు ఏకాంతంగా, ఉపవాసంతో వేచి ఉంటుంది. ఆ ఓపికా, సహనం తర్వాత దానికి నూతన యవ్వనం వస్తుంది. అప్పుడు అది మరో 30 ఏళ్లు గంభీరంగా జీవిస్తుంది.

నీతి: మన ఆత్మీయ జీవితంలో కూడా లోకపు భారాలు మనల్ని కృంగదీస్తున్నప్పుడు, దేవుడనే బండ చెంతకు వెళ్లి మన పాత అలవాట్లను విడిచిపెట్టి కనిపెడితే, ఆయన మనకు నూతన బలమునిచ్చి లోకముపై విజయమును ఇస్తాడు.

ప్రతి వారి జీవితములో ప్రతి ఒక్కరు దేవుని సన్నిధానములో ఏకాంతముగా కనిపెట్టి ప్రార్ధించవలెను.ఖచ్చితముగా జీవితములో ఉపవాసదినములు రాత్రిబగళ్ళు ఉపవాసముండి ప్రార్ధించేను.

దేశచరిత్రను మార్చివేసెను.ఏలీయా,మోషే అనువాదం 40 దినములు దేవుని సన్నిధానములో కనిపెట్టిరి,ప్రభువైన యేసుక్రీస్తు అరణ్యములోనికి వెళ్ళి నలువది దినములు దేవుని సన్నిధానములో కనిపెట్టి నందున పరలోక శక్తిని అపరిమితముగా పొందుకొనెను.

దేవుని సన్నిధానములో కనిపెట్టువారు నూతన బలము పొందుచున్నారు.వారు శత్రువుల వ్యతిరేకత లేక పోరాటములను గూర్చి ఏ మాత్రమును చింతించక ప్రభువు కొరకు లేచి ప్రకాశించుదురు.

“సీయోను,లెమ్ము లెమ్ము ని బలము ధరించుకొనుము.”అని దేవుడు చెప్పుచున్నాడు.యెషయా 52:1 . దేవుని బిడ్డలారా, మీకు నూతన బలము కావలెను.ప్రాణముతోను,ఆత్మతోను దైవీక శక్తి కావలెను.

ఫై నుండి వచ్చు పరిశుద్దాత్మ శక్తి కావలెను. కాబట్టి దేవుని సన్నిధానములో కనిపెట్టి బలముపై బలము పొందండి.

 

గొప్ప పలుకు:-

“ప్రార్థనలో మోకరించే వ్యక్తి, లోకంలో ఎదురయ్యే ఏ సమస్యకైనా ధైర్యంగా నిలబడగలడు.”

 ప్రార్థన:-

పరిశుద్ధుడవైన మా తండ్రీ, ఈ దినము మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. పక్షిరాజు తన బలమును నూతనపరచుకున్నట్లు, నా ఆత్మీయ జీవితములో కూడా నూతన శక్తిని ప్రసాదించండి. శత్రువు తెచ్చే అంధకార శక్తులను, పోరాటాలను జయించుటకు మీ పరిశుద్ధాత్మ బలమును నాకు అనుగ్రహించండి. నేను అలసిపోయిన వేళలలో మీ సన్నిధిలో కనిపెట్టే ఓపికను ఇవ్వండి. మోషే, ఏలీయా మరియు యేసు ప్రభువు వలె ప్రార్థనలో గడిపి, పరలోకపు శక్తిని పొందుకొని, మీ సాక్షిగా జీవించే కృపను దయచేయండి. నన్ను బలహీనత నుండి బలములోనికి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రీ, ఆమేన్.

ONE YEAR BIBLE READING PLAN:-

నిర్గమ కాండము 33-35 అధ్యాయములు

Posted in: Blog, యేసుతో ప్రతి ఉదయము Tagged: "నూతన బలము - ఆత్మీయ పునరుజ్జీవనం"

యేసుతో ప్రతి ఉదయము-DAY 28 పునరుద్ధరణ: పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుట

January 29, 2026 by banturajeshwari67 1 Comment

యేసుతో ప్రతి ఉదయము:-

ఈరోజు దేవుని వాగ్దానము:-

“నా జనులు ఇకనెన్నడును సిగ్గునొందక యుందురు.” యోవేలు 2:27

పునరుద్ధరణ: పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుట

“ఇశ్రాయేలీయుల మధ్యనున్న వాడను నేనే యనియు  నేనే మీ దేవుడనైన యెహోవాననియు,నేను తప్ప వేరు దేవుడొకడును లేడనియు మీరు తేలిసికొందురు. నా జనులు ఇకనేన్నడును సిగ్గునొందక యుందురు.”

యోవేలు 2:27

1.మీరు ఎక్కడికి వెళ్లినను, ఎప్పుడు వెళ్లినను నిజమైన యేసుక్రీస్తు ప్రభువును   మీతో నుండునట్లు నిశ్చయపరచుకొనుడి.

  1. మీరేదైనా పోగుట్టుకుంటె దానిని లేక మీ తప్పులను ఒప్పుకొనుటకు సిగ్గుపడే నవసరము లేదు.

నీ తప్పిదమును,అవమానమును కప్పిపుచ్చుకొనకుము. సహాయమునకై ఇతరుల యొద్దకు వెళ్లక నేరుగా యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వెళ్లుము.

ఆయన పాదముల చెంత నిన్ను తగ్గించుకొని నీ తప్పులను,నీవు పోగొట్టుకొనిన దానిని ఒప్పుకొనుము.

నీవు “అయ్యో! నా యజమానుడా !నేనేమిచేయవలెను” అని ప్రార్ధించవలెను. నష్టము సంభవించిన స్థలమునకు క్రీస్తు ప్రభువు నిన్ను తీసికొని వెళ్లనిమ్ము. దేవుడు నీకేలాగున సహాయము చేయగలడో చూచుటకు ఇష్టపూర్వకముగా సిద్దపడి యుండుము.

ఎలీషా నరికిన ఆ కొమ్ము యేసు క్రీస్తు ప్రభువు యొక్క సిలువను గూర్చి మాట్లాడును. మన పాపముల నిమిత్తమే ఆయన  మ్రానుమీద వేలాడి మరణించెను అదే సిలువ ద్వారము మనము పోగొట్టుకొనిన దానిని తిరిగి సంపాదించుకొనవచ్చును. విశ్వాసము ద్వారా సిలువను మన జీవితంలో అన్వయించుకొని తద్వారా మనము పోగొట్టుకొనిన ప్రతి దానిని తిరిగి పొందుటను మనము చూడగలము.

 ఇక్కడ సామాన్య నియమమును గుర్తుంచుకొనుము. మొట్టమొదటిగా నీ జీవితంలో నష్టము ఆరంభమైన స్థలమునకు వెళ్లి ఆ స్థలమును ప్రభువుకు చూపించు “అవును  ప్రభువా! ఫలానా తేదీన ,ఫలానా సమయమున నేను అవివేకంగా ప్రవర్తించినందుకు ఈ నష్టము నా జీవితంలో వాటిల్లినది అని చెప్పుము”. 

ఇట్టి ఒప్పుదల తో నీవు ప్రభువు వద్దకు వెళ్ళినప్పుడే నీ ప్రతి నష్టమును సమకూర్చుటకు ఆయన సిలువ శక్తి ద్వారా ఆయన నీకు సహాయము చేయును. దీనికిగాను సజీవమైన, సామాన్యమైన విశ్వాసము అవసరము. “ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను” అని మన ప్రభువు మనతో చెప్పిన రీతిగా ఆయన మనతో ఉన్నాడు. ఆయన యొద్దకు వెళ్ళుటకు సందేహింపకము. నీవు పోగొట్టుకొనిన వాటి విషయమై ఆయనతో చెప్పి వాటన్నిటినీ సమకూర్చుకొనుటకు గాను నీకు సహాయము చేయుటకే ఆయన సిలువలో మరణించినని నమ్ముము.

ఎలీషా మరియు గొడ్డలి:-

మీరు ప్రస్తావించిన అంశం 2 రాజులు 6:1-7 లోని అద్భుతాన్ని గుర్తుచేస్తోంది.

 ప్రవక్తల శిష్యులు యొర్దాను నది దగ్గర దూలాలు నరుకుతుండగా, ఒకరి గొడ్డలి నీళ్ళలో పడిపోతుంది. అది అప్పు తెచ్చినది కావడం వల్ల అతను “అయ్యో నా యజమానుడా, ఇది అరువు తెచ్చినదే” అని బాధపడతాడు.

గొడ్డలి ఎక్కడ పడిందో ఎలీషా అడిగి, అక్కడ ఒక కర్రను (కొమ్మను) వేయగా, ఇనుము నీళ్లపై తేలుతుంది.

    • ఆ కొమ్మ క్రీస్తు సిలువకు సాదృశ్యం.

    • నీవు ఎక్కడైతే నీ ఆత్మీయతను లేదా ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావో, అక్కడికే తిరిగి వెళ్లి ప్రభువుకు చూపించాలి. సిలువ శక్తి ద్వారా పోగొట్టుకున్నది తిరిగి పొందుతావు.

 గొప్ప పలుకు:-

“నీ తప్పును ఒప్పుకోవడానికి సిగ్గుపడకు, ఎందుకంటే నీ అవమానాన్ని భరించడానికే క్రీస్తు సిలువపై మరణించాడు. నువ్వు పోగొట్టుకున్న చోటే దేవుడు నిన్ను తిరిగి నిలబెడతాడు.”

 ప్రార్థన:-

ప్రార్థన: “పరలోకపు తండ్రీ, నీవు నా మధ్య ఉన్నావని, నేను ఎన్నడూ సిగ్గుపడనని నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనాలు. ప్రభువా, నా జీవితంలో నేను తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల పోగొట్టుకున్న ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. (మీరు పోగొట్టుకున్న దాని గురించి ఇక్కడ చెప్పండి…).

ప్రభువా, ఎలీషా కాలంలో నీవు ఆ గొడ్డలిని ఎలాగైతే తిరిగి ఇచ్చావో, నీ సిలువ శక్తి ద్వారా నా జీవితంలో కలిగిన నష్టాన్ని పూడ్చమని వేడుకుంటున్నాను. నా అపరాధములను కప్పిపుచ్చుకోకుండా నీ పాదాల చెంత పెడుతున్నాను. నన్ను క్షమించి, నీ కృపతో నన్ను బలపరిచి, పోగొట్టుకున్న వాటన్నిటినీ రెట్టింపుగా దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రీ. ఆమేన్.”

ONE YEAR BIBLE READIN PLAN:-

నిర్గమకాండము 30-32 అధ్యాయములు

Posted in: Blog, యేసుతో ప్రతి ఉదయము Tagged: "పునరుద్ధరణ: పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుట"

యేసుతో ప్రతి ఉదయము-DAY 27-యెహోవాయందలి ఆనందమున-నూతన బలము

January 28, 2026 by banturajeshwari67 Leave a Comment

యేసుతో ప్రతి ఉదయము:-

ఈరోజు దేవుని వాగ్దానము :-

యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు నెహెమ్యా 8:10

యెహోవాయందలి ఆనందమున-నూతన బలము

దేవుని సంతోషము ఆయన బిడ్డలందరికీ చెందవలసి ఉన్నది దిన దినము ఆయన వాక్యమును ఎందరైతే తమ హృదయములలో ప్రవేశింపనిచ్చి దానిని విశ్వాసముతో అంగీకరింతురు వారెల్లరు దేవుని ఆనందమును పొందగలరు 

నెహెమ్యా ఎనిమిదవ అధ్యాయంలోఇశ్రాయేలు ప్రజలందరూ 

  • ఏక మనస్సుతోను
  • ఏకతాత్పర్యముతోనూ 
  • ఆ వాక్యమును నూతనముగా వినుటకై కూడుకొని ఉండిరి. 

దేవుని సేవకులు వాక్యమును బోధించుచుండగా వారి హృదయములో సంతోషభరితములాయెను. “వారికి బహు సంతోషము పుట్టెను”.

  • మన మొండితనము
  • బుద్ధిహీనతల చేత 
  • మన గతించిన జీవితం 
  • నిష్ఫలముగాను, 
  • అపజయములతో కూడినది గాను ఉండవచ్చు. 

అయితే దేవుడు గడచిన మన బ్రతుకులను క్షమించి మనలను తిరిగి తన యొద్దకు రాబట్టుకొనుటకు మనకు నూతన ఆనందము- “యెహోవాయందలి ఆనందమును” అనుగ్రహించుటకు కూడా ఇచ్చుచున్నాడు ఆ  ఆనందము మన బలముగా ఉండవలెను. మనము ఆయన వైపు తిరిగిన క్షణమే ప్రారంభమై ఆయనతో మనము నడిచిన కొలది అడుగడుగు కు విస్తరించుచుండు  ఆనందం మది. 

 ఆత్మీయమైన చిన్న కధ:నిజమైన బలం 

ఒక ఊరిలో ఒక వ్యక్తి ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. తన గతకాలపు తప్పులు, అపజయాలు తలచుకొని కృంగిపోయేవాడు. ఒకరోజు అతను ఒక వృద్ధ దైవజనుడిని  కలిసి,”అయ్యా నా జీవితం అంత అపజయాలే, నాకు బలం కావాలి అని అడిగాడు. 

ఆ దైవజనుడు అతని చేతికి ఒక ఖాళీ గ్లాసు ఇచ్చి, దానిని పైకి పట్టుకోమన్నాడు. ఐదు నిమిషాల తర్వాత ఆ వ్యక్తి చేయి నొప్పి పుడుతోంది అన్నాడు. అప్పుడు దైవజనుడు ఇలా అన్నాడు: “నీ గతకాలపు బాధలు కూడా ఈ గ్లాసు లాంటివే. నువ్వు వాటిని ఎంతసేపు పట్టుకుని ఉంటే, అంత బలహీనపడతావు. వాటిని దేవుని పాదాల దగ్గర వదిలేసి, ఆయన ఇచ్చే క్షమాపణను బట్టి ‘సంతోషించడం’ మొదలుపెట్టు. నువ్వు సంతోషించినప్పుడే, నీ భారమంతా ఆయన మోస్తాడు. అప్పుడే నీకు నిజమైన బలము వస్తుంది.“

 

 గొప్ప దైవజనుల మాటలు

  • సి.హెచ్. స్పర్జన్ (C.H. Spurgeon): “క్రైస్తవుని సంతోషం లోకసంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. పరిస్థితులు మారవచ్చు, కానీ దేవుని యందలి ఆనందం మన ఆత్మకు కవచం వంటిది.”
  • కోరీ టెన్ బూమ్ (Corrie ten Boom): “మీరు లోకాన్ని చూస్తే కలవరపడతారు, మిమ్మల్ని మీరు చూసుకుంటే కృంగిపోతారు, కానీ క్రీస్తు వైపు చూస్తే విశ్రాంతిని, సంతోషాన్ని పొందుతారు.”

 

ప్రార్థన:-

పరిశుద్ధుడైన తండ్రీ, ఈ ఉదయకాలము నీ వాగ్దానము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. గడిచిన కాలంలో మా బుద్ధిహీనత వల్ల, అపజయాల వల్ల మేము కోల్పోయిన ఆనందాన్ని నేడు మాకు తిరిగి ప్రసాదించండి. “యెహోవాయందలి ఆనందమే మా బలము” అని మేము నమ్ముతున్నాము. మా గత పాపములను క్షమించి, నీ వాక్యము ద్వారా మా హృదయాలకు నూతన ఉత్సాహాన్ని దయచేయండి. ఈ రోజంతా నీ తోడ్పాటు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రీ, ఆమెన్.

 

“దుఃఖము రాత్రి కాలమున నిలుచును, ఉదయమున సంతోషము కలుగును.” (కీర్తన 30:5)

ONE YEAR BIBLE STUDY PLAN:-

నిర్గమకాండము 28-29 అధ్యాయములు

 

Posted in: Blog, యేసుతో ప్రతి ఉదయము Tagged: యెహోవాయందలి ఆనందమున-నూతన బలము

యేసుతో ప్రతి ఉదయము-DAY26-“నిశ్శబ్దంలో నిలిచిన నేస్తం”

January 27, 2026 by banturajeshwari67 Leave a Comment

యేసుతో ప్రతి ఉదయము:-

ఈరోజు దేవుని వాగ్దానము:-

యెషయా 41:10

నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొం దును.

 ఒంటరితనము అనేది కేవలము మనుషులు చుట్టూ లేకపోవడం కాదు. మనల్ని అర్థం చేసుకునే వారు లేరని భావన. కానీ బైబిల్ చెప్తుంది, తల్లి తన బిడ్డను మరచిన ఆయన మనల్ని మరువడు.

 యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు, దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు, షడ్రుకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు వారికి “తోడై”ఉన్నాడు.

 ఆయా సందర్భంలో దేవుడు నీకు- తోడైయున్నాను అని చెప్పటం చదువుతున్నాము క్రీస్తు లేని ఒంటరితనము భయమును తెచుచున్నది.  ఒంటరితనము వేదనతో కూడినది . ఒంటరితనము హృదయమును పిండి వేయునంత శక్తి గలది. ఒంటరిగానున్న వారి మీద సాతాను ఎల్లప్పుడూ దాడి చేయుచున్నాడు.దేవుని బిడ్డలారా, ఎన్నడును ఒంటరిగా ఉండవద్దు; ప్రభువుతో కూడా ఉండండి 

దైవ ప్రసన్నతను కలిగి ఉండండి. మీతో కూడా దేవదూతలు ఉన్నారు. “నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు”. ఆదికాండము 2: 18 

ఒంటరితనము – ఒంటరిగా ఉన్నాను అనే భావన మధ్య వ్యత్యాసం కలదు. చాలా మంది రెండవ రకమునకు చెందిన వారై ఉన్నారు “నాకు ఎవరు లేరు, నేను ఒంటరిగానున్నాను అని తలంచువారిని ఒప్పింప చేయుట చాలా కష్టం. 

మనము ఒంటరిగా ఉన్నప్పుడు- ప్రభువు నాతో కూడా ఉన్నాడు అనే విశ్వసించవలెను. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లేని కారణమున ఒంటరితనమును ఎదుర్కొనవలసి ఉంటుంది. ఒకరోతోనొకరు మాట్లాడుకొనని పక్షమున అందరూ కలసిఉండినను అందరు ఒంటరిగా ఉన్నట్లు ఆవేదన చెందుతారు. ఒంటరితనం నిరుపేదల మధ్యనే ఉన్నదని తలంచవద్దు. ధనవంతుల సహితము విలపించుచున్నారు.”నాకు విస్తారమైన ధన ధాన్యములు ఉండినను ప్రయోజనమేమి? మా కుటుంబంలో నన్ను ప్రేమించుటలేదు. నా బంధుమిత్రుల మధ్య వారి ప్రేమను కోరుతూ ఏకాకిగా నిలిచి ఉన్నాను.

రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకలేనున్నాను కీర్తనలు 102:7

“నిశ్శబ్దంలో నిలిచిన నేస్తం” (The Friend in the Silence)

 ఒక చిన్న కథ:-

ఒక ఊరిలో ఒక వృద్ధురాలు ఉండేది. ఆమెకు బంధువులెవరూ లేరు, అనారోగ్యం వల్ల బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఒంటరిగా గడిపేది. ఆమె ఇంటి పక్కన ఒక యువకుడు ఉండేవాడు. ఆమె ఎప్పుడూ తన గదిలో ఎవరితోనో మాట్లాడుతున్నట్లు అతనికి అనిపించేది.

ఒకరోజు అతను ధైర్యం చేసి ఆమెను అడిగాడు, “అమ్మా, మీ ఇంట్లో ఎవరూ లేరు కదా, మీరు ఎవరితో అంత సేపు మాట్లాడుతుంటారు?” అని.

ఆమె నవ్వుతూ తన పక్కనే ఉన్న ఒక ఖాళీ కుర్చీని చూపించి ఇలా అంది: “బాబు, చాలా ఏళ్ల క్రితం నేను ప్రార్థన చేయలేక ఇబ్బంది పడుతుంటే, ఒక దైవ సేవకుడు నాకు ఒక సలహా ఇచ్చాడు. ‘ప్రార్థన అంటే ఏదో కష్టమైన పని కాదు, నీ ఎదురుగా ఒక ఖాళీ కుర్చీ వేసుకో, అందులో యేసుప్రభువు కూర్చున్నారని ఊహించుకో.. నీ మనసులో ఉన్నవన్నీ ఆయనతో చెప్పు’ అని చెప్పారు. అప్పటి నుండి ఈ ఖాళీ కుర్చీ నాకు ఖాళీగా అనిపించదు. నా యేసు నా పక్కనే కూర్చుని నా మాటలు వింటున్నారని నాకు తెలుసు. అందుకే నాకు అస్సలు ఒంటరితనం అనిపించదు.”

కొన్ని రోజుల తర్వాత ఆమె ప్రశాంతంగా మరణించింది. ఆ సమయంలో ఆమె తల ఆ ఖాళీ కుర్చీ మీద వాలి ఉందట. అంటే, చివరి శ్వాస వరకు ఆమె తన దేవుని ఒడిలోనే ఉందన్నమాట.

గొప్ప పలుకులు & సేవకుల మాటలు

  • బిలీ గ్రాహం: “దేవుడు తన బిడ్డలను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు, ఆయన మౌనంగా ఉన్నాడంటే అర్థం ఆయన మీ కోసం ఏదో గొప్ప కార్యం సిద్ధం చేస్తున్నాడని.”
  • సి.హెచ్. స్పర్జన్: “ప్రభువు తోడు ఉన్నప్పుడు, అరణ్యం కూడా పరలోక ద్వారంలా మారుతుంది.”

 

ప్రార్థన:-

ప్రేమగల తండ్రి, ఈ రోజు ఈ వాక్యం చదువుతున్న బిడ్డలను ఆశీర్వదించండి. ఎవరైతే ఒంటరితనంతో, ఆవేదనతో, నిరాశతో ఉన్నారో వారి హృదయాలను తాకండి. “నేను నీకు తోడై ఉన్నాను” అన్న నీ వాగ్దానాన్ని వారి జీవితాల్లో నెరవేర్చండి. కుటుంబాల్లో ఐక్యతను ఇవ్వండి. మనుషుల ప్రేమ కంటే మిన్నయైన నీ దివ్య ప్రేమతో మమ్మల్ని నింపమని, యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.

ONE YEAR BIBLE READING PLAN

నిర్గమ కాండము 25-27 అధ్యాయములు

 

Posted in: Blog Tagged: "నిశ్శబ్దంలో నిలిచిన నేస్తం"

యేసుతో ప్రతి ఉదయము-DAY25-అగ్నిలో తోడైయుండే దేవుడు

January 26, 2026 by banturajeshwari67 Leave a Comment

యేసుతో ప్రతి ఉదయము :-

ఈరోజు దేవుని వాగ్దానము:-

“నీవు అగ్నిమధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు.” (యెషయా 43:2)

 

నేటి వాక్య ధ్యానం: అగ్నిలో తోడైయుండే దేవుడు

“నీవు అగ్నిమధ్యను నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు.” (యెషయా 43:2)

“ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను”.ప్రకటన 1:14

అగ్ని జ్వాల వంటి కనులను గూర్చి ప్రకటన 2:18 మరియు 19:12 లోను చదువుచున్నాము . ప్రత్యక్ష గుడారమందలి బలిపీఠం మీద ఆరని అగ్ని కలదు.

ప్రేమ జ్వాలలు అగ్ని జ్వాలలతో సమము. పరమ 8:6,7. శ్రమలు అగ్నితో పోలచబడుచున్నవి.యెషయా 43:2 తీర్పు తీర్చు అగ్ని సోదోమ గొమొఱ్ఱా పట్టణముల మీదకు వచ్చెను .

ఆదికాండము 19:24 ప్రత్యుత్తరముగా దిగి వచ్చు అగ్ని కలదు. 1 రాజులు 18:28. నరకము అగ్నిగంధకములతో మండు గుండము. ప్రకటన 21:8

అగ్నిజ్వాలల వంటి కన్నులను ప్రభువు కలిగి ఉన్నాడు.దానిని పరిశుధ్హాత్మ అగ్నితో పోల్చవచ్చు.”నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని.అది ఇదివరకే రగులుకొని మండవలెనని యెంతో కోరుచున్నాను”.లూకా 12:49.ఇది ప్రభువు నోట నుండి వచ్చిన మాట. ఆయనకు ముందు దూతగా వచ్చిన బాప్తిస్మమిచ్చు యోహాను “మారుమనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను;అయితే నా వెనుక వచ్చుచున్నవాడు పరిశుద్దాత్మతోను అగ్నితో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను ” మత్తయి 3:11 అగ్ని-అగ్నిజ్వాల మధ్య వ్యత్యాసము కలదు. అగ్ని జ్వాల అధికముగా వ్యాపించును,సమస్తమును దహించి వేయును . మన దేవుడు దహించు అగ్నియేయున్నాడు.

 

మండుచున్న పొద మధ్య నుండి దేవుడు మోషేతో మాట్లాడేను. నిర్గమకాండము 3:1-4 పొద మండుచుండెను గాని అది కాలిపోలేదు.

నేడును అగ్నిజ్వాలల వంటి ప్రభువు కన్నులు మిమ్మును చూచుచున్నవి.

అగ్నివంటి దేవుని వాక్యము సాతాను కట్లను బంధకములను పటాపంచలుగా   తెంచివేయుటను చూడగలము.

 

​​మన జీవితంలో శ్రమలు అగ్నిజ్వాలల్లా  చుట్టుముట్టినప్పుడు మనం భయపడతాము  కానీ దేవుని వాగ్దానం ఏమిటంటే, ఆయన మనల్ని అగ్నిలో నుండి తప్పించడం మాత్రమే కాదు మధ్యలో మనతో కూడా నడుస్తాడు.

శుద్ధికరణ:-

 వెండిని పుట్టము వేసినట్లు దేవుడు మనల్ని శ్రమలనే  అగ్నిలో వేసి మనలోని మాలిన్యాన్ని తీసివేసి మనల్ని ప్రకాశింపజేస్తాడు.

కట్లు తెంచే అగ్ని:-

 అగ్నిగుండంలో వేయబడిన ముగ్గురు యవ్వనస్తుల బంధకాలు మాత్రమే కాలిపోయాయి, వారి శరీరాలు కాదు అంటే దేవుడు అనుమతించే శ్రమలు మన పాపపు కట్లను లోకపు బంధాలను తెంచి వేయడానికే.

 

ప్రేరణాత్మక కథ: కమ్మరి మరియు ఇనుము

ఒక విశ్వాసి తన జీవితంలో ఎదురవుతున్న వరుస కష్టాలను చూసి విసిగిపోయి, ఒక దైవజనుడిని ఇలా అడిగాడు: “నేను ఇంతగా ప్రార్థిస్తున్నా, దేవుడు నన్ను ఎందుకు ఈ అగ్ని వంటి శ్రమల గుండా నడిపిస్తున్నాడు?”

అప్పుడు ఆ దైవజనుడు ఒక కమ్మరి పనిని చూపిస్తూ ఇలా అన్నాడు: “చూడు, కమ్మరి ఇనుమును ఎర్రటి అగ్నిలో ఉంచుతాడు. అది బాగా కాలిన తర్వాత తీసి సుత్తితో కొడతాడు. దాన్ని ఒక ఉపయోగకరమైన ఆయుధంగా మార్చడానికే ఆయన అలా చేస్తాడు. ఒకవేళ ఆ ఇనుము అగ్నిని తట్టుకోలేకపోతే, దాన్ని పక్కన పడేస్తాడు. నేను దేవుని చేతిలో ఉపయోగపడే ఆయుధంగా ఉండాలని కోరుకుంటున్నాను తప్ప, పనికిరాని ఇనుములా పక్కన పడి ఉండాలని అనుకోవడం లేదు.”

మన జీవితంలో అగ్ని వంటి శోధనలు వస్తున్నాయంటే, దేవుడు మనల్ని ఒక గొప్ప ఆయుధంగా తీర్చిదిద్దుతున్నాడని అర్థం.

 

 గొప్ప పలుకులు – సేవకుల మాటలు

  • “నీవు అగ్నిలో ఉన్నప్పుడు, నీ పక్కన నాలుగవ వ్యక్తిగా దేవుడు ఉన్నాడని మర్చిపోకు.”
  • “దేవుడు నిన్ను అగ్ని గుండంలోకి పంపితే, నిన్ను కాల్చడానికి కాదు, నీలోని బంగారాన్ని బయటకు తీయడానికి.”

 

ప్రార్థన

ప్రేమగల తండ్రీ, ఈ ఉదయం నీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. ప్రభువా, మా జీవితంలో ఎదురవుతున్న శోధనలను చూసి మేము భయపడకుండా, నీవు మాకు తోడై ఉన్నావని నమ్మే కృపను ఇవ్వండి. మా బంధకాలను తెంపివేసి, నీ సేవలో మమ్మల్ని బలమైన ఆయుధాలుగా వాడుకోండి. అగ్ని వంటి కష్టాలలో కూడా నీ శాంతిని మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రీ… ఆమేన్!

ONE YEAR BIBLE READING PLAN

నిర్గమకాండము 22-24అధ్యాయములు

Posted in: యేసుతో ప్రతి ఉదయము, Blog Tagged: అగ్నిలో తోడైయుండే దేవుడు

యేసుతో ప్రతి ఉదయము-DAY 24-కనిపించని కవచం

January 25, 2026 by banturajeshwari67 Leave a Comment

యేసుతో ప్రతి ఉదయము:-

ఈరోజు దేవుని వాగ్దానము:-

యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి  కీర్తనలు 34 :15

కార్యములు ఆల్బమ్లై యున్నను కాలమును తృణీకరించిన వాడెవడు? లోకమంతటనను సంచారము చేయు యెహోవా యొక్క ఏడు నేత్రములు  జెరుబ్బాబెలు చేతిలో చేతిలో గుండుసూలు ఉండుట చూచి సంతోషించును.జెకర్యా 4:10

“పరిశీలించే దేవుని కన్ను – భద్రతనిచ్చే ఆయన హస్తం”

దేవుడు కేవలం చూసేవాడు మాత్రమే కాదు, తన బిడ్డల చుట్టూ రక్షణ కవచంలా ఉండి, విరోధి తలపెట్టే కీడును ముందే పసిగట్టి అడ్డుకునేవాడు.

ప్రభువు కన్నులు లోకమంతా సంచారం చేయుచు మానవ హృదయం పరిశీలించు కన్నులుగా ఉన్నవి ప్రభువు యొక్క వేడుకలు అని చదివిన తక్షణం ప్రభువునకు ఏడు కన్నులు ఉన్నదని తలంచరాదు కేవలం ఏడు  అను సంఖ్య సంపూర్ణతను సూచించుచున్నది. ప్రభువు పరిపూర్ణముగా  సమస్తమును చూచువాడు భార్యాభర్తలు గొడవపడినప్పుడు ఒకరి మీద ఒకరు నేరం ముగ్గురు అయితే ప్రభువు ముఖమును కాదు హృదయమును చూచువాడై ఉన్నాడు జెరుబ్బాబెలు  చేతిలో గుండు నూలుండుటను ఆనాడు  దేవుడు  చూచెను.

 

యాకోబునకు హాని చేయ ఉద్దేశ్యముతో లాభం కొందరు మనుష్యులను  వెంటబెట్టుకొని వచ్చుచుండెను. అది యాకోబుకు తెలియదు కానీ దానిని చూచిన దేవుడు రాత్రివేళ స్వప్నమందు లాభాలతో  మాటలాడెను.” నీవు యాకోబుతో మంచిగానే చెడ్డ కానీ పలుకు జాగ్రత్త  సుమీ”.  ఆదికాండము 31:24 వచనం అందువలన అతడు యాకోబుతో సమాధాన పడి  నిబంధన చేసుకొనెను.

 “దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు”. రోమా 8:31. మీకు విరోధముగా మంత్ర ప్రయోగం చేయువాడెవడు?

 

“ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు”. కీర్తనలు 121:4 నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు యెషయా  54: 17 యాకోబునకు విరోధమైన మంత్రము లేదు. సంఖ్యాకాండము 23:23. దేవుని బిడ్డా! భయపడవద్దు లాబాను కదలికను  కనిపెట్టి యాకోబును రక్షించిన దేవుడు నమ్మదగినవాడు. “యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యెహోవా  సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు .తన  కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు”.కీర్తనలు 11:4 దానికి కారణం కాదు వివేకము కలిగి దేవుని వెదకువారు  కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. 

యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి  కీర్తనలు 34 :15

జీవిత అనుభవం: “కనిపించని కవచం”

ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి తన ఉద్యోగ రీత్యా ప్రతిరోజూ రాత్రి వేళ బైక్ మీద ప్రయాణించాల్సి వచ్చేది. ఒకరోజు ఆఫీసులో పని ఒత్తిడి వల్ల బాగా ఆలస్యమైంది. మనసులో ఏదో తెలియని ఆందోళన, కానీ జెకర్యా 4:10 వాక్యాన్ని తలచుకుంటూ, “దేవుని కన్ను నాపై ఉంది” అని ధైర్యం తెచ్చుకుని ప్రయాణం మొదలుపెట్టాడు.

నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రివేళ, ఒక మలుపు వద్ద కొందరు దారి దోపిడీ దొంగలు శేఖర్‌ను ఆపడానికి సిద్ధంగా ఉన్నారు. వారు ఆయుధాలతో పొదల్లో దాగి ఉన్నారు. శేఖర్‌కు ఇది తెలియదు. సరిగ్గా ఆ మలుపు దగ్గరకు వచ్చేసరికి, అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక పోలీస్ పెట్రోలింగ్ వాహనం సైరన్ వేస్తూ శేఖర్ బైక్ వెనకాలే వచ్చింది. అది చూసి దొంగలు భయపడి పారిపోయారు.

దేవుని హస్తం: శేఖర్ క్షేమంగా ఇంటికి చేరాడు. మరుసటి రోజు పేపర్లో అదే చోట గ్యాంగ్ పట్టుబడిన వార్త చదివి నిర్ఘాంతపోయాడు. ఆ పోలీస్ వాహనం సరిగ్గా అదే సమయానికి ఎందుకు వచ్చింది? తనను ఎవరు కాపాడారు? శేఖర్‌కు అప్పుడు అర్థమైంది—లాబానును స్వప్నంలో హెచ్చరించిన దేవుడే, తనను ఆ రాత్రి ఆ ప్రమాదం నుండి కాపాడారు.

 

ఈ కథ నేర్పే పాఠం (Moral)

మనం ఒంటరిగా ఉన్నామని, మన సమస్యలు ఎవరికీ తెలియవని మనం అనుకుంటాం. కానీ జెరుబ్బాబెలు చేతిలో ఉన్న చిన్న వస్తువును చూసిన దేవుడు, చీకటిలో నీవు నడుస్తున్న అడుగులను కూడా చూస్తున్నాడు.

“మనుషులు నిన్ను తృణీకరించవచ్చు, కానీ నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను నిరంతరం కనిపెట్టుకొని ఉన్నాడు.”

 

గొప్ప పలుకులు (Inspirational Quotes)

  • “నీవు ప్రార్థనలో అడిగినది దేవుడు వినకముందే, నీకు రాబోయే ప్రమాదాన్ని ఆయన కన్ను చూస్తుంది.”
  • “దేవుని దృష్టి నీ మీద ఉంటే, లోకపు దృష్టి నీకేం చేయలేదు.”
  • “పరిస్థితులు నీకు విరోధంగా ఉన్నప్పుడు, పరలోకపు సింహాసనం నీ పక్షాన కదులుతుంది.”
  • “మనుషులు ముఖమును చూస్తారు, కానీ దేవుడు హృదయమును మరియు యదార్థతను చూస్తాడు.”
  • “నీకు విరోధముగా ఆయుధము రూపింపబడవచ్చు, కానీ అది వర్ధిల్లదు; ఎందుకంటే నిన్ను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు.”
  • “సంఖ్యలో తక్కువని భయపడకు, దేవుని ‘ఏడు కన్నుల’ (సంపూర్ణ దృష్టి) కనికరం నీ మీద ఉంది.”

“ప్రియ దేవుని బిడ్డలారా, జెరుబ్బాబెలు చేతిలో ఉన్న ఆ చిన్న గుండునూలు (Plumb line) చూసి లోకం నవ్వుకోవచ్చు, కానీ దేవుడు దానిని చూసి సంతోషించాడు. నీవు చేసే చిన్న పనినైనా దేవుడు చూస్తున్నాడు. శత్రువు నీపై మంత్ర ప్రయోగాలు చేస్తున్నాడని భయపడుతున్నావా? యాకోబు పక్షాన నిలిచిన దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన దృష్టి నీపై ఉన్నంత వరకు ఏ శక్తీ నిన్ను తాకలేదు.”

 

పరిశుద్ధుడైన మా తండ్రి,

మహోన్నతుడైన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలమున మీ వాగ్దానము ద్వారా మాతో మాట్లాడినందుకు వందనములు. ప్రభువా, జెరుబ్బాబెలు చేతిలో ఉన్న చిన్న గుండునూలును చూసి సంతోషించిన మీ కన్నులు, ఈ రోజు నా జీవితంలో నేను చేసే ప్రతి చిన్న ప్రయత్నాన్ని చూస్తున్నాయని నమ్ముతున్నాను.

దేవా, లోకమంతటా సంచారము చేసే మీ ఏడు నేత్రములు (పరిపూర్ణ దృష్టి) నా పక్షాన ఉన్నందుకు స్తోత్రములు. యాకోబుకు తెలియకుండానే లాబానును హెచ్చరించి, శత్రువు చేతి నుండి అతడిని కాపాడిన దేవుడవు నీవు. నా జీవితంలో కూడా నాకు తెలియకుండా నాకు విరోధముగా జరుగుతున్న ప్రతి మంత్ర ప్రయోగాన్ని, దుష్టుని ఆలోచనలను, శత్రువు కుతంత్రాలను మీ కనుదృష్టితో లయము చేయండి.

“ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు” అని సెలవిచ్చినట్లు, నా కుటుంబము చుట్టూ, నా ప్రయాణముల చుట్టూ మీ రక్షణ కవచము ఉంచండి. నేను నీతిమార్గములో నడుచునట్లు నన్ను బలపరచండి. నా హృదయాన్ని పరిశీలించి, మీ చిత్తానుసారంగా నన్ను నడిపించండి.

నీవే మా పక్షాన ఉండగా మాకు విరోధి ఎవడు? ఈ రోజంతా మీ కృప మాకు తోడుగా ఉంచి, ప్రతి ఆపద నుండి తప్పించి, సాయంత్రము వరకు మమ్మల్ని క్షేమంగా ఉంచమని, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.

ONE YEAR BIBLE READING PALN

నిర్గమకాండము 19-21 అధ్యాయములు

 

Posted in: Blog, యేసుతో ప్రతి ఉదయము Tagged: "పరిశీలించే దేవుని కన్ను - భద్రతనిచ్చే ఆయన హస్తం"
1 2 3 4 Next »

Recent Posts

  • యేసుతోప్రతిఉదయము-DAY 33 దేవుని కన్ను మీపై ఉంది
  • యేసుతో ప్రతి ఉదయము DAY 32/విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు
  • యేసుతో ప్రతి ఉదయము-DAY 31-ఎడారి జీవితంలో వసంతం
  • యేసుతో ప్రతి ఉదయము-DAY 30-విశ్వాసి ఆయుధం: క్రీస్తు నామము
  • యేసు ప్రతి ఉదయము-DAY 29-“నూతన బలము – ఆత్మీయ పునరుజ్జీవనం”

Recent Comments

  1. Satya on యేసుతో ప్రతి ఉదయము DAY 32/విశ్వాసం: అడగక ముందే ఇచ్చే దేవుడు
  2. SatyaValli on యేసుతో ప్రతి ఉదయము-DAY 28 పునరుద్ధరణ: పోగొట్టుకున్న ప్రతిదీ తిరిగి పొందుట

Copyright © 2026 PRAYERS TO THE WORLD.

Church WordPress Theme by themehall.com

G-DYR27RHXFV